ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ప్రక్యాత సినిమా నటుడు NT రామారావు తెలుగు దేశం పార్టి ఆవిర్భవించినప్పుడు ఒక్క క్రొత్త రాజకీయ వరవడిని సృష్టించి వెనకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకుని ఈ రాష్ట్రంలో ఒక్క పెను ప్రభంజనం సృష్టించింది . పేరుకు తెలుగు వాడి ఆత్మగౌరవం తో ఏర్పడిన దాని మూలం మాత్రం సామజిక కుల సమీకరణము మాత్రమే . ఆనాటి నుండి నేటి వరకు అవర్గము అది తమ సొంత పార్టి గా అనుకుంటూ వచ్చారు . వెనకబడిన తరగతులను ప్రోస్తాహించటం వలన ఆపార్టి మనుగడ సాధిస్తూ వస్తుంది . ఇదేసందర్బం లో జాతీయ కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రం లో రెడ్డి సామజిక వర్గం నాయకత్వం లో మిగత దళిత ,ముస్లిం కులాలు తమ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్నారు .
అయితే ఇటీవల కాలం లో Dr వై ఎస్ రాజశేకర్ రెడ్డి ముక్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో చాల వర్గాలకు తను వ్యక్తి గతంగా చాల దగ్గర అయ్యేడు . అతినిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అయితే రాజశేకర్ రెడ్డి గారు అకాల మరణం తరువాత ఈ రాష్ట్రం లో రాజకీయ ,సమజకంగా పెను మార్పులు సంభవించాయి. రాజశేకర్ రెడ్డి తనయుడు వివిధ కారణాలన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టి స్తాపించటం , రాజశేకర్ రెడ్డి ని అభిమానించే కొంతమంది MLA లు ఆ పార్టికి మద్దతు ఇవ్వటం ,అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టి కి వెతిరేకంగా అవిస్వాసతీర్మానానికి మద్దతు పలకటం , తమ అధికారం కోల్పోయి మరల వై ఎస్ జగన్ స్తాపించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి నుండి ఎన్నికలకు వెళ్ళటం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల లో ఒక్క గొప్ప మార్పుని మనం గమనించాలి. మొత్తం 18 అసెంబ్లీ , ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం లో అధికార కాంగ్రెస్ పార్టికి 5 స్తానలలో ధరావత్తు కోల్పోవటం , ప్రతిపక్ష తెలుగుదేశం కొన్ని చోట్ల ధరావత్తు కోల్పోవటం ఇక్కడ మనం చర్చించుకోవాలి . అసలికి ఈ ధరావత్తు కోల్పోవటానికి ప్రధాన కారణం ఏంటి ? అనేది మనం విశ్లేషించుకుంటే తర తరాలుగా వస్తున్న ఓటు బ్యాంకు వరద వచ్చి కొట్టుకు పోయినట్టుగా కొత్త పార్టి , కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపింది . కాంగ్రెస్ కి పెట్టని కోట లాగా ఉన్న దళిత ,ముస్లిం మైనారిటీ వర్గాలు మరియు తెలుగు దేశానికి మొదటినుండి ఆయువు పట్టుగా ఉన్న BC ఓటర్లు 7 నుండి 8 శాతం తగ్గిపోవటం ఆ రెండు పార్టీలకు ధరావత్తు కోల్పోవటానికి ప్రదాన కారణం . ఈ వర్గాలకు ధరలు పెరగటం కాని , అవినీతి అక్రమాలు కానీ , జాతీయ రాజకీయ సమీకరణాలతో పనిలేదు. నమ్మకం , ఈ పార్టి నాయకత్వం లో మేము క్షేమంగా ఉండగలం అనే విశ్వాసం . ఏది ఏమి అయిన మన రాష్ట్రం లో ప్రదానం గా కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి సామాజక వర్గం నుండి బలిజ - కాపు సామజిక వర్గం వైపునకు , తెలుగు దేశం తమ ఖమ్మ సామజిక వర్గం మరియు కొంత BC వర్గాలను , కొత్త గా ఆవిర్భవించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ రెడ్డి , దళిత ,ముస్లిం, మైనారిటీ వర్గాల పార్టీల మాదిరిగా సమీకరణలు మారిపోతున్నాయి.అయితే ఇక్కడ మిగత సామజిక వర్గాలను , మరియు BJP , TRS పార్టి ల గురించి ఆలోచించాలి . BJP కి రాష్ట్రం లో సరి అయిన నాయకత్వం లేకపోవటం వలన తమకి అనుకూలమైన వర్గాలను ఆకర్షించ లేక పోతుంది. అలాగే TRS ఒక్క ప్రాంతానికే , ఒక్క అంశానికే పరిమితి అవటం మనం ఇక్కడ గుర్తుఉంచుకోవాలి . అయితే TRS ని వెలమ సామజిక వర్గ పార్టీగా ముద్రవేయటానికి కొంతమంది ప్రయత్నించిన TRS ఆ విమర్శ నుండి సులభంగా బయట పడుతుంది . అయితే ఈ సమీకరణలు ముందు ముందు ఇలాగె ఉంటాయ లేదా అనేది ఆయ పార్టీల రాజకీయ సమీకరణ , వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమ కార్యక్రమాల బట్టి కాలం నిర్ణయిస్తుంది .

Political n Social analysis is fine, some what to cleared at the closing... for the sake of Party's as well as Voter Gods(.) Separation of Dalits n Muslims from Congress is great task for YSRCP, n BCs from TDPs attachment since 1982. Now these people wants their Identification by the Party's for their increased self respect, individuality, etc..
రిప్లయితొలగించండి