22, డిసెంబర్ 2012, శనివారం

సిగ్గు పడదాం !



బారత దేశం పుణ్యభూమి, ఖర్మ భూమి ఇక్కడ ఎందరో ఋషులు , పుణ్యస్త్రీలు నివసించిన ప్రాంతం. బుద్దుడు జన్మించిన నేల. వేల సంవస్తరాల క్రితం, చరిత్రలో పురాణాలలో మనం చదువుకున్నది కిరాతకులు చిట్టి అడవిలో , కొండ గుహల్లో ఉండేవారు , రాను రాను వారె దోపిడీ దొంగలు అయ్యారు అటుగా వొచ్చిన ఆడవాళ్ళను బలత్కరించే వాళ్ళు కానీ నేడు సభ్య సమాజం లో మన మధ్యే , మనతోనే తిరుగుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు , ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే బలాత్కారిస్తున్నారు , ఘోరంగా , కిరాతకంగా ప్రపంచం తలతిన్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. 

నేడు దేశం అట్టూడికి పోతుంది , ఎక్కడ చుసిన నిరసనలు ,రాష్ట్రపతి భవన్ ముట్టడి , దేశ పార్లమెంట్ ముట్టడి , డిల్లీ నడి రోడ్ మీద ఒక్క 23 సంవత్సరాల యువతి మీద అత్యంత దారుణంగా ,పాశవికంగా జరిగిన రేప్ నేడు దేశం తల దించుకునెల చేసింది .

ఆది నుండి నేటి కలియుగం వరకు మనకు సమాజం స్త్రీ ని అత్యంత దారుణంగా చూస్తుంది. ముక్యంగా మనువాదుల పితృస్వామ్య వ్యవస్తలో ' స్త్రీ ' ఒక్క విలాస వస్తువు . మన అమ్మమ్మలు చెప్పే కథ లు నుండి నేటి మన మహేష్ బట్ సినిమా కథల వరకు అదే వివక్ష . చిన్నప్పటి నుండే మన మగాళ్ళు తమ మగ తనం వింటూ ఉంటారు కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు , ఇద్దరు భార్యలు ఇంకా అత్యంత ప్రియమైన ప్రేయసి . ఇక్కడ అత్యంత ప్రతివతగా ,గుణ గణ లు కలిగిన రుక్మిణి ని ఆడపిల్లలకు చెబుతారు. అప్పుడే మనం ఈ వివక్షను ప్రశ్నించి ఉంటె ఈ దేశ మహిళల భవిషత్ నేడు రోడ్డుపాలు అయ్యేది కాదు ఏమో . హరిచంద్రుడు తన భార్యను వారణాసి నడి వీధిలో అమ్ముతున్నప్పుడు చంద్రమతి ప్రశ్నించి ఉంటె ! నేడు బజారులలో ఆడపిల్ల అమ్మకానికి వస్తువు అయ్యేది కాదు ఏమో . ఏదైనా మహిళలకే అవమానాలు అయిన ,అమ్మకాలు అయిన . నీవు ప్రతివతవు కాదు అన్నప్పుడు ' సీత ' లాగి రాముడు చెంపమీద కొట్టి ఉంటె ' రాముడి ' మత్తు వోదిలేది . ఒక్క ఆడది బారతదేశం నడి వీదిలో అవమానం పడి తనను తానూ ప్రతివత అని నిరుపించుకోవటానికి అగ్ని లో దూకి నిరూపించుకుంది . ప్రాతివత్యం పోగూడదు అని భర్త చితిమీద దూకింది. ఆనాడు కౌరవుల నిండు సభలో, సభ్య సమాజం ముందు ' ద్రౌపతి ' ని దుశ్శాసనుడు అవమానించినప్పుడే ఆ నాటి సమాజం ఖండించి ఉంటె నేడు అభినయ దుశ్శాసనులు నేడు మన నడి బజారుల్లో స్త్రీని బలత్కరించే వాళ్ళు కాదు.

ఏది ఏమైనా వివిధ కారణాల వలన నేడు నడి రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా ఉంటె తన ఉనికికే ప్రమాదం వస్తుంది . ఇందుకు సమాజం బాద్యత వహించటం లేదు . గ్లోబలీకరణ నేపద్యం లో పాచత్య అలవాట్లు , కల్చర్ మన దేశాన్ని ముంచేస్తుంది . ముక్యంగా మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతుంది. అడ్డమైన ధారావాహిక కథలు , రాత్రి 10 గం అయితే నేరుగా మన ఇళ్ళలోకి శృంగార కావ్యాలు వచ్చేస్తున్నాయి . బాలీవుడ్ సినిమాల రూపంలో అడ్డు అదుపులేని శృంగారం. మన పసి జీవితాలమీద బలవంతంగా రుద్దు తున్నాయి . స్కూల్స్ ముందు సినిమా ప్రకటన ఉండకూడదు అని ఎన్ని చట్టాలు చెప్పిన పట్టించు కునే నాధుడు యేడి , చట్టాన్ని దైర్యంగా అమలుచేసే అధికారి ఏడి ? 
సమాజం తన భాద్యత మరిచి పోయింది . గుడి , బడి వ్యాపార వస్తువు అయింది. ఇప్పుడు గాంధీ మనకు ఆదర్శం కాదు ' ఇమ్రాన్ హాష్మి మనకు ఆదర్శం. అభివృద్ధి ఒక్క వస్తువు , వ్యాపారలలోనే కాదు ' నాగరీకత ' లో కుడా ఉండాలి. అనాగారీకంగా స్త్రీలను మానబంగం  చెయ్యటం నాగరికత కే అవమానం .

 యత్ర  నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత 

నిజంగా ' వేద కాలం లో స్త్రీ పూజింపబడిండా ! లేక వాళ్ళు ముందుగానే మనిషి అవలక్షణం ఉహించి  చెప్పేరా !   స్త్రే " ఆది పరాశక్తి " అంటాం , అని పూజిస్తాం ఏది ఆశక్తి ? ఆనాడు ఒక్క నరకాసురుడిని చంపితే పండగ చేసుకున్నాం మరి నేడు ఊరికో నరకాసురుడు , ఆసిడ్ బాటిల్ తో , బ్లేడ్ లతో , మగతనం తో .

 అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే 
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్నువిలాసిని జిష్నునుతె 
భగవతి హే శితికంతకుతుమబిని భూరి కుటుంబిని భూరి క్రితే 
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే 

మా ప్రార్ధన ఆలకించు తల్లి ఇంకొక సారి నీ విశ్వరూపం చూపించి నీ బిడ్డలను రక్షించు తల్లి !!

14, డిసెంబర్ 2012, శుక్రవారం

దున్నేవాడిదే భూమి


" దున్నే వాడిదే భూమి " ఒక్కప్పుడు ఈ నినాదం వాడ ,వాడల మార్మోగింది , లక్షలాది మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రదాన ఆదాయ వనరు అయిన " భూమి " . ఎలాంటి కుల వృత్తి లేనటువంటి ప్రజలకు భూమి ఒక్క ఆయువుపట్టు . సామాజికంగా , ఆర్ధికంగా వెనకబడిన వర్గాలను వివక్ష నుండి రక్షించాలి అంటే భూమి కావలి .

దశబ్దాలు గడిచేకొద్దీ మనువాదులు ఈ దేశాన్ని , సమాజాన్ని కులం వర్గాల వారిగా విడదీసినప్పుడు అనాదిగా భూమినే నమ్ముకున్న ' ఈ దేశపు ములవాసులు ' భూమి నుండి దూరంగా నేట్టవేయబడ్డారు . భూమి లేని ప్రజలు బానిసలుగా , కూలీలుగా మార్పు చెందేరు . " పోరాడితే పోయేది ఏముంది - బానిస సంకెళ్ళు తప్పా "  ఈ నినాదం వాళ్ళ ఊపిరి అయ్యింది . అవును బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందటానికి ఇంటికొక మనిషి గుట్టల్లో , చెట్టులో తమ ప్రాణాన్ని పెట్టి పోరాడరు . భరత మాత తమ పిల్లల కోసం తనే రాసుకున్న రాజ్యాంగాన్ని కాదు అని బానిసలుగా , వెట్టి చాకిరి చేయిస్తున్న పెట్టందారులను ఎదుర్కోవటానికి ఒక్కొకరు ఒక్క " సూర్యుడి " లా భగ ,భగ మండేరు.

కాలం మారింది , ప్రజల తిరుగుబాటు కు ప్రభుత్వాలు కదిలేయి , మీకోసం భూమి పంచుతాం అన్నారు , అడవి , గుట్ట , నీరు మీదే అన్నారు . రాళ్ళూ ,రప్పలు , తప్ప నీరులేని భూమి ఇచ్చేరు అయిన సరే తమ రక్తాన్నే నీరుగా పోసి బంగారాన్ని పండించేరు . బానిస - బంగారాన్ని పండించేడు . పెద్దోడి కన్ను బగారం మీద - కాదు బంగారం లాంటి భూమి మీద పడింది 

భరత మాత ' మాట తప్పింది ' ! మీ కోసం ఈ  భూమి అన్న నోరు ఇప్పుడు అదే నోటి తో అబద్దం ఆడుతుంది. మీకోసం అభివృద్ధి అంటూ అదే గుట్టలను , భూమిని భలవంతాన లాక్కుంటుంది. బ్రతిమిలాడి , దండం పెడితే తుపాకి ఎక్కుపెట్టింది. తిరగబడితే యుద్ధం ప్రకటించింది . బారతమాత తన బిడ్డలు మీద " యుద్ధం " ప్రకటించింది. 

66 సంత్సరాల స్వాత్రంత  బారత దేశం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. భూమి అడిగిన పాపానికి యుద్ధం ప్రకటించింది. ఇన్ని సంత్సరాలు పాలకులు చూపిన అభివృద్ధి నీటి రాతలే . నేటికి కిలో బియ్యం కొనలేని స్తితిలో ఇదే పాలకులు ప్రజలను బిచ్చగాళ్ళుగా తమ దుకాణాల మీద నుంచో పెట్టింది . ఎవరికోసం ఈ కిలో " రూపాయి " బిక్ష . భూమి , నీరు మీరు తీసుకుని మాకు బిక్ష ఇస్తారా ! అని అడిగే శక్తి లేని ప్రజలను ఓట్ల రాజకీయాల కోసం బిక్షగాళ్ళను చేస్తుంది .అభివృద్దిని అరచేతిలో చూపించి , ఇంకొక చేతితో పీకలు నోక్కేస్తుంది.

ప్రజా ప్రభుత్వాలు భందు ప్రీతి , అవినీతి ఊబిలో పీకల్లోతుల్లో మునిగి సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణ , గ్లోబలైజేషన్ లో ప్రజలను వలస వాదులు గా చేస్తున్నాయి . పెట్టుబడి దారుల గుప్పెట్లో ప్రజా ప్రభుత్వాలు అత్యంత క్రూరంగా ప్రజలను భూమి నుండి దూరం చేస్తున్నాయి. ఆర్ధిక అవసరాల కోసం ప్రపంచ దేశాలు ఒక్కటి అవుతున్నాయి , కానీ ఆ దేశం లోని ప్రజలను విడదీస్తున్నాయి . తర తరాలుగా వెనకబడి అభివృద్ధి కోసం , తమ స్తితి గతుల్లో మార్పు కోసం ఒక వర్గం గా , అభివృద్ధి పేరుతొ ప్రజలను దోచుకున్న ఇంకొక వర్గం ఇంకొక వైపు !
అందుకే " దున్నేవాడిదే భూమి " కావలి , ఇంకొక్క సారి మారుమోగాలి 

అదిగో వస్తున్నాయి , వస్తున్నాయి 
జగన్నాధ రధచక్రాలు ...,
వద్దు ,ఇంకా ఆశపడకండి .

ఈ భూమి , నీరు మనదే. పోరాడండి , పోరాడితే పోయేది బానిస సంకెళ్ళు .

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

సైన్సు - దేవుడు - ప్రకృతి


ఆ మద్య మన శాస్త్రజ్ఞులు " మేధోమధనం " చేసి - కృత్రిమంగా మేఘాలను మధనం చేసి వర్షాలు సృస్తిస్తము అని వేలాది కోట్ల ప్రజల సొమ్మును మంట పెట్టి పోగవేసేరు. ఈ మద్య మన దేవుడి Represents యజ్ఞ , యాగాలు చేసి కుంభవృష్టి గా వర్షాలు పడేటట్టు చేస్తాము అని దేవుని సొమ్ము - ప్రజల సొమ్ము బూడిద చేసేరు . కానీ ప్రకృతి మాత్రం తన ధర్మం ప్రకారం ఏ రోజులలో వర్షం పడాలో ఆరోజు తన ఋతువులు ప్రకారం వర్షం కురిపిస్తుంది. మనకు చిన్నతనం నుండి తెలుసు ' వినాయక చవితి ' కి వర్షం పడటం లాగే ' దీపావళికి ' వర్షం పడటం , మనం మతాబులు బయట ఎండకు అరబెట్టడం , చినుకు పడితే ఇంటిలో పెట్టుకోవటం ఇవి అన్ని మనకు తెలిసిందే . ఋతువుల ప్రభావం వలన రాష్ట్రము లో వర్షాలు పడుతున్నాయి , మా ఊరిలో కూడా ముసురు పట్టి గత మూడు రోజులుగా వర్షం పడుతుంది . అందుకే మనం ' ప్రకృతిని ' ప్రేమిద్దాం , పూజిద్దాం. 

మన పూర్వికులు ప్రకృతిని ప్రేమిచేరు - చెట్టుని ( వేప చెట్టు ) పూజించేరు , జంతువు ( గోమాత ) ని పూజించేరు , నీళ్ళను ( గంగ నది ) ని పూజించేరు , భూమిని , పక్షులను, పుట్టలను పూజించేరు . వాళ్ళకు మన ప్రకృతిలో ప్రతిదీ పుజ్యనీయమే ,చిన్నతనం లో పిచ్చుక ల గుంపు ఇంటిముందు వాలితే  సజ్జలనో , లేదా అన్నమో చల్లేవాళ్ళు మన తాతలు , వాటిని తరమకూడదు అని చెప్పేవాళ్ళు . ఒక్కప్పుడు మట్టి పాత్రలు, సత్తు పాత్రలు మన ఇళ్ళలో ఉంటె స్టీల్ పాత్రలు ఉండే వాళ్ళను చూసి చిన్న బుచ్చుకున్నం , ఇప్పుడు వాటిస్తనం లో " ప్లాస్టిక్ " మహం మారి మన ఇంటిని ఆక్రమించుకున్నాయి . ఆ  విషం వలన మన ముక్కు పచ్చని చిన్నారులు చనిపోతున్న మనం వాటినే ప్రేమిస్తున్నాం. మనం ఇప్పుడు ప్రకృతిని పూజించటం లేదు , కనిపించని ఆ దేవుడిని పుజిస్తున్నాం. ప్రకృతికి విరుద్దంగా మనం కృత్రిమ ప్రకృతిని సృస్టిస్తున్నాం. అందుకే మన ఇళ్ళలో ప్లాస్టిక్ పూవులు , ప్లాస్టిక్ తోరణాలు , ప్లాస్టిక్ ప్లేట్స్. అంటే మన వినాశనాన్ని మనమే కోరుకున్నం ......కోరుకుంటున్నాం .

మనకు ప్రకృతి అద్బుతమైన జీవ సంపదనించింది , చిన్న , చిన్న క్రిమి కీటకాలనుండి పశు పక్షాదులు వరకే అన్నీ మన జీవన పరిణామా క్రమములో మనకు ఉపయోగపడుతున్నవే . మనకు తెల్లవారింది అని చెప్పటానికి " కాకులను " ఎండా కాలం వచ్చింది అని చెప్పటానికి  " కోకిలను " ప్రతి కాలాన్ని చెప్పటానికి ,ఋతువు లు మార్పులను , కాలం మార్పులను చెప్పటానికి  ఒక్కొక్క చెట్టును , పక్షులను , జంతువులను ప్రసాదించింది .ఎండిన ఆకులు , పశువుల పేడ , చెత్త ఇవే ఒక్కప్పుడు మన భూమిని సారవంతం చేసింది , నేడు కృత్రిమంగా సృష్టించుకున్న రసాయనిక ఎరువులు , విషాన్ని పండిస్తున్నాయి , ఆవిషం తిన్న మనం 40 ఎండలకే గుండెపోటు కి గురిఅవుతున్నాం , మన చిన్న తల్లుల లో అసహజ శారీరిక మార్పులు .
వీటన్నిటికి మనం మన ప్రకృతి దేవతను పూజించక పోవటమే ఇన్ని అనర్దాలు , లేని దేవుడి కోసం మనం కోట్లు ఖర్చు చేస్తున్నాం , కృత్రిమంగా సృష్టించే science ని , దేవుడి పేరు చెప్పి ప్రకృతి విద్వంసం చేసే వాళ్ళను పుజించకండి . కృత్రిమ పువ్వులు ఇంటిలో పెట్టుకునే కంటే ఒక్క మందార చెట్టుని పెంచండి , విరగ పూసిన మందారాలు మన కి ఆహ్లాదనాన్ని ఇస్తాయి , మన శిరోజాలకు రక్షణ కవచంగా ఉంటుంది.  
మనలను మనం వినాశనం చేసుకునే కంటే ప్రకృతిని కాపాడుకుందాం . ప్రకృతిని పూజిద్దాం 
సర్వేజన సుఖినో భవంతు !!!
( Bio diversity సదస్సు సందర్భంగా ) 

16, ఆగస్టు 2012, గురువారం

నేటి భారతం


మీకు హిందీ నటుడు మనోజ్ కుమార్ నటించిన రోటి  - కపడా - ఔర్ మఖాన్ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా పేరు లాగానే నేటి మన దేశం లోని కోట్లాది మంది రోటి కాపాడ మఖాన్ సినిమా . ఈ 65  సవస్తరాల స్వత్రంత బారత దేశం లో పిడికిలి గింజలు కోసం రోజు పోరాటమే . ఆ రోజుల్లోనే నేటి మన దేశ భవిషత్  ఉహించి రాయటం చాల అచ్చర్య కరం .

స్వాత్రంతం రాకముందు తెల్ల దొరలూ ఈ దేశ ప్రజల రక్త మాంసాలను హరించి వేస్తె నేటి పాలకులు వాళ్ళనే అనుసరించటం శోచనీయం .ఆనాటి ప్రజలు స్వాత్రంతం వచ్చిన తరువాత " రామ రాజ్యం " వస్తుంది ఏమో అని భ్రమ పడ్డారు . ఆ రాజ్యం లో కూటికి  , గుడ్డకు లేని భారతీయులు ఉండరు ఏమో అని భ్రమ పడ్డారు . శ్రీమతి ఇందిరా గాంధీ ప్రవేసిపెట్టిన " గరీబ్ హటావో "  కూడా ఈ దేశ ప్రజల ఆకలి తీర్చలేక పోతుంది .65 యేండ్ల స్వత్రంత భారత సమాజం రోజు రోజుకి భక్క చిక్కి పోతుంది .రోజు రోజు కి ఈ దేశం లో అవినీతి , భందు ప్రీతి ఎక్కువైపోతుంది . ప్రభుత్వాలకు మానవత్వ లేకుండా పోతుంది .లక్షలాది క్వింటాళ్ళ ధాన్యం ముక్కి పోతుంటే ఇంకొక వైపు ఒడిష లాంటి రాష్ట్రాలలో ప్రజల ఆకలి చావులు  . రాజకీయ నాయకులూ , పెట్టుబడుదారులు ,ప్రభుత్వ అధికారులు కలసి పోయి ఈ దేశ ఆర్ధిక వ్యవస్తను రాబందుల్ల దోచుకుంటున్నారు .

బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని , ఈ దేశ సంపదను సాంస్కృతిక వారసత్వాన్ని  దోచుకు వెళ్ళితే, వాళ్ళ అడుగు జాడల్లో నడిచే  మన కుహన మేధావి వర్గం ప్రపంచీకరణ పేరుతొ మన culture ని వెకిలి చేష్టలతో , బావ దారిద్రం తో అవమానిస్తున్నారు . 

మన అందరికి తెలుసు రత్నాలు రాసులు గా పోసి రోడ్ల మీద అమ్మిన ఘనత మనది . కనీసం ఇంటికి తలుపులు కూడా లేకుండా ఉన్న ప్రాంతం మనది అలాంటి మన దేశం లో ఈ రోజు ఎక్కడ చుసిన అవినీతి , లంచగొండి తనం , కల్తి వస్తువులు ధనార్జనే ధ్యేయం . ప్రపంచానికి ధర్మం సిద్దాంతం అందించిన  మన పవిత్ర భూమి మీద ఎందుకు మనం కులం ,మతం ,ప్రాంతం పేరుతొ ఒక్క సమాజం లో నివసించే మనం శత్రువులుగా , ఒకరి మీద ఒక్కరు అపనమ్మకం తో జీవిస్తున్నారు .

ఆర్దిక అసమానతలు ఈ దేశానికి పెను సవాల్  ఆరోజే ఈ అసమానతలు తొలగించి ఉంటె బావి భారతం నేడు ఈ ప్రసవ వేదన నుండి బయట పడేది. దగాకోరు పాలకుల నుండి స్వేచగా స్వతంత్ర ఫలాలను అనుభవించి ఉండేవాళ్ళం .

మనం ఒక్క బొంబాయి నగరాన్నే తీసుకుంటే 62 % మంది బొంబాయి ప్రజలు మురికి వాడల్లోనే జీవిస్తున్నారు ఈ జనాబా మొత్తం మహానగరం 6 % భూమి లో నివసిస్తున్నారు . ముంబై మురికి వాడల వృద్ది రేట్ ముంబై మహానగరం అభివృద్ధి కంటే ఎక్కువ . ఈ దేశ నిరుపేదలు ప్రస్తుత సరళీకృత ఆర్ధిక విధానం తో ఇంకా పేదలు గానే ఉండిపోతున్నారు . వీళ్ళు బతుకు చిత్రం ఆస్కార్ లాంటి అవార్డు లు గెలవవచ్చు కానీ వీళ్ళు మాత్రం ఇంకా పేదలు గానే ఉండిపోతున్నారు . పల్లెటూరు పెట్టె సర్దుకొని నగరాల దారి వెతుకుంటున్నారు. ఊర్లు , ఊర్లు కాలి అయిపోతున్నాయి గుప్పెడు గింజలు కోసం . 

ఈ దేశ ప్రజలకు ఇంకా ప్రభుత్వాల మీద ఆశ ఉంది అందుకే తిరుగుబాటు చెయ్యకుండా " mang rahahai hindustan ..,roti - kapada -Aur makaan  ....అంటూ పాడుకుంటూ ఆశతో జీవిస్తున్నారు . 

15, జులై 2012, ఆదివారం

" తెలంగాణా - ఈజిప్ట్ " ఉద్యమం !

ఈ మద్య ఒక్క మేధావి ఈజిప్ట్ తరహ ఉద్యమం చేద్దాం అంటున్నాడు , అవసరం అయితే అక్కడికి నాయకులను పంపి అద్యయనం చేద్దాం అంటున్నాడు . ఈజిప్ట్ ఉద్యమం దశబ్దాలుగా నియంత పరిపాలనలో ఉండి, ఉక్కుపాదాల కింద నలిగి అణిగి ,అణిగి ఉండి ఒక్కసారిగా అణు బాంబుల విస్పోటనం చెంది ప్రజాస్వామ్య పరిపాలనకోసం జరిగిన ఒక్క మహత్తర సంఘటన . కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లో కొంతమంది రాజకీయ భూస్వాములు తమ రాజకీయ ప్రాదాన్యత కోసం ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆ బడుగు శవాల  పునాదుల మీద  వీళ్ళ రాజకీయ మేడలు నిర్మించుకొంటున్నారు.

తెలంగాణా ఉద్యమం ఒక్క ప్రజాస్వామ్య కోసం  అని ఎలా చెప్పగలరు ? లేదా అత్మాభిమాన పోరాటం అని ఎలా చెప్పగలరు ? ఒక్క రాష్ట్ర విభజనతో ఆ ప్రాంత సామన్య ప్రజల జీవన స్తితిగతులు ఎలా మారగలవు? ఇదే ప్రజాస్వామ్య దేశం లో, ఇదే ప్రాంతం లో  తర తరాలుగా బానిస బ్రతుకు బతికిన గిరిజన , దళిత , వెనకబడిన వర్గాల ప్రజల సామజిక , ఆర్దిక ,రాజకీయ భవిషత్ ను రాష్ట్ర విభజనతో మార్చగలరా ? ఇదే దొరల ఫ్యూడల్  పెత్తనాన్ని ఎదిరించి చివరకు తుపాకీ పట్టి తమ ఆత్మగౌరవం కోసం పోరాడితే తీవ్రవాది అని తినే అన్నంలో విషం పెట్టి ఎన్కౌంటర్ పేరుతొ కాల్చి చంపుతున్నారే . ఇప్పడు ఈ దొరలూ చేస్తున్న ఉద్యమం ఆయా వర్గాల స్తితిగతులు మర్చగలదా అంటే సందేహమే ! అప్పుడు లేని ఆత్మ గౌరవం , ఇప్పుడు ఎలా ఉంది?

ప్రపంచీకరణ , గ్లోబలీకరణ సమాజం లో ఒక్క రాష్ట్రము విడిపోతే అక్కడి స్తితిగతులు మారతాయ అనేది అక్షరాల అసత్యం . పెట్టుబడుదారులు, జాతి ,ప్రాంతం ,దేశం అనే తేడా లేకుండా దేశ ప్రజల లేదా ఆ ప్రాంత ప్రజల సహజ సంపదని  దోచుకుంటుంటే ఒక్క మాట అన ని ఈ మేధావులు , రాజకీయ వాదులు రేపు తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటో ప్రజలు అడగాలి . బడుగు వర్గాల తల్లులు తమ బిడ్డలను బలిదానాలకు పంపేటప్పుడు ఉద్యమం నాయుకులను నిలదీయాలి .

పోరాటాలలో , ఉద్యమాలలో ప్రజల పాత్రలేకుండా రాజకీయ పార్టి ల కార్యకర్తలతో ఉద్యమం చేస్తే అది ఖచితంగా రాజకీయ పోరాటమే . అది ఈజిప్ట్ తరహా ఉద్యమం అయిన సాయుధ పోరాటం అయిన ప్రజలకు నమ్మకం కలగాలి , నాయకత్వం ఆ దిశగా వెళ్ళాలి .ఓట్ల గెలుపుతో అది ప్రజల మద్దత్తు అనుకోవటం పొరపాటు అవుతుంది. ఎప్పుడు అయితే ప్రజలు ఉద్యమం లోకి  వస్తారో అప్పుడు ఏ పాలకులు , ప్రభుత్వం అయిన దిగిరావలిసిందే. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం . అప్పుడు ప్రజల కోరిక " ప్రత్యెక తెలంగాణా " రాష్ట్రము ఏర్పడుతుంది . అప్పటి వరకూ అది రాజకీయ ఆదిపత్య పోరాటమే . ఈజిప్ట్ తరహ ఉద్యమం ఆయినా , విప్లవం అయిన ఓట్ల ,సీట్లు కోసమే అవుతుంది .

11, జులై 2012, బుధవారం

ఓట్ల " విభజన "

ఆంద్ర ప్రదేశ్ ఎలా ఆవిర్భవించిందో మన అందరికీ బాగా తెలుసు దానిగురించి మనం చర్చించుకోవటం పెద్దగా అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ మనం ఒక్కవిషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం  ఇంకొక కారణం. ప్రస్తుతం మన రాష్ట్రము లో గత 12 యేండ్లనుండి రాష్ట్రాన్ని రెండుగా చెయ్యాలి అని ఒక్క ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు పోరాటం చేస్తున్నారు .రాష్ట్రాన్ని విడతీయాలి , లేదు సమైక్యంగా ఉంచాలి అనేది పక్కన పెడితే ఈ విభజన వలన ఏ రాజకీయ పార్టికి ఎక్కువ ఓట్లు వస్తాయి , ఏ పార్టి అధికారం లోకి వస్తుంది అనేది ప్రదానమైన సమస్య . ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కాకుండా రాజకీయ పార్టీల భవిషత్ గురించి చర్చించుకోవటం విడ్డురం . కాంగ్రెస్ కి లాభమా , తే రా స కి లాభమా అని చర్చలు జరపటం బాధాకరం .వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి గెలుపు ఆపాలి అంటే రాష్ట్ర విభజన చెయ్యాలి ,ఆ పార్టీని ఆవిధంగా అడ్డుకోవాలి అని కుడా చర్చలు జరుగుతున్నాయి 


2014 లో రాహుల్ గాంధీ ప్రదాని కావాలి అంటే తెలంగాణా ని విభాజించాలా? తే ర స  ని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని రాష్ట్రాన్ని విభజిస్తే మెజారిటి MP స్తానాలు కాంగ్రీస్ వి అప్పుడు రాహుల్ గాంధీ ప్రదాని కావటానికి మెజారిటి స్తానాలు కాంగ్రెస్ కి సరిపోతాయి అనే తప్పా అసలకి ఒక్క రాష్ట్రాన్ని ఏ సిద్దాంతం మీద విభజించాలి , రాష్ట్రాల ప్రయోజనాలు ,ఆయా ప్రాంతాల ప్రజల అవసరం ఏమిటి ,దేశ సమగ్రత ,దేశం లో జరిగే పరిణామాలు ఏంటి అనేవి పాలకులు కాని ,మిగత రాజకీయ పార్టిలు కానీ ఆలోచించటం లేదు , వాళ్ళ రాజకీయ భవిషత్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు .


మన రాష్ట్రము లో రెండో అతిపెద్ద విభజన సమస్య SC వర్గీకరణ ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు దేశం మొత్తానికి సంబందినిచినది అసలకు ఇది రాష్ట్రాలతో సంబంధం లేని సమస్య కానీ రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం ఇలాంటి విభజనలు మన ముందుకు తీసుకు వస్తున్నారు . ఈ మద్య ఒక్క పార్టి విస్త్రుతస్తాయి సమావేశం లో 2014 లో ఆ పార్టి గెలుపుకోసం దీనిని కూడా తమ ఎజండా లో ప్రదాన పదకం గా పెట్టుకున్నారు . 



రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం , ఓట్లకోసం ,సీట్ల కోసం ఇలాగ మనుషులు మద్య ,ప్రాంతాల మద్య ,కులాల మద్య విభజన రేఖ గీస్తున్నారు . ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన విభజించు పాలించు అనే రాజనీతి సూత్రాన్ని ఇప్పుడు మనవాళ్ళు , మన ప్రజల మీద ప్రయోగిస్తున్నారు . ఇంకొక ఆచర్యకరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీలలో రెండు గ్రూపులు ఒకరు వెతిరేకిస్తారు ,ఇంకొకరు సమర్దిస్తారు ఆ పార్టి అధినాయకత్వం ఏమి అనదు. అంటే పార్టీల , వ్యక్తుల స్వలాభం కోసమే ఈ విభజన?  వీళ్ళకు మేధావి అనే ఇంకొక వర్గం వత్తాసు పలుకుతూ ఉంటుంది . 



ప్రభుత్వాలు ఓట్ల కోసం కాకుండా ప్రజల , దేశ అవసరాలకోసం , ప్రజల జీవిత ప్రమానాలకోసం రాష్ట్రాలను కానీ ,ప్రజలను కానీ విభజిస్తే మంచిదే , ఆ పేరుతొ ప్రాంతాలతో , ప్రజలతో ,తమ తమ వ్యక్తిగత ,రాజకీయ అవసరాలకోసం విభజిస్తే సమాజం ఒప్పుకోదు...చరిత్రలో స్తానం ఉండదు .






3, జులై 2012, మంగళవారం

హిందూ మతం ప్రమాదం లో ఉందా !


ఈ మద్య మీడియా లో ఈ రకమైన చర్చ చూస్తున్నాం , ఎవరు అయితే హిందూ ధర్మానికి ( మతం ) పెద్దలగా ఉన్నారో, అలాగే స్కాలర్స్ , స్వామీజీ లు ,పూజారులు ఇంకా మతానికి సంబందించిన పెద్దలు హిందూ మతానికి లేదా ధర్మానికి ఈ దేశం లో ప్రజలు దూరము అవుతున్నారు , అన్యమతనికి ఆకర్షింప బడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు . అసలకి హిందూ మతం నుండి ఎందుకు ఇతర మతం లోకి వెళ్ళుతున్నారు అని ఎవరు ప్రశ్నించటం లేదు . మనలో లోపం ఏంటి ,ఎందుకీ దుస్తితి అని ఏ మత పెద్ద కాని ,స్వామిజి లు కాని ప్రశ్నించటం లేదు . గొడ్డును (బీఫ్ ) ని చంపితేనే హాహాకారాలు చేస్తున్న ఈ పెద్ద మనుషులు , సాటి మనిషిని ఎందుకు గౌరవించటం లేదు .మీ అందరకి ప్రత్యేకమైన గోత్ర నామాలు ఉన్నప్పుడు ఇతర కులాల వారికీ ముక్యంగా దళితులను ఎందుకు గౌరవించటం లేదు . పశువు కంటే హీనమా ?. ఆలోచించండి మత పెద్దలారా . తర తరాలుగా హిందూ మతం / ధర్మాన్ని ఆచరిస్తున్న దళితులు , గిరిజనులు ఇంకా గ్రామాలలో ఉన్నారు .మీ అవివేకం తో వారినికూడా దూరం చేసుకోవద్దు . ఎవరు ఈ రోజులలో డబ్బుకోసం . పాలు, రొట్టె కోసం మతం మారుతున్నారు అంటే అది మీ బ్రమే. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడు ఖచితంగా వేరే మార్గం ఆలోచిస్తారు .

ఇంకొక ప్రధాన వాదన ఈ గ్రూపు సబ్యులు మిగత వాళ్ళ మాటలకూ ప్రేరణ కలిగిన ప్రజలు ముస్లిం , క్రిస్టియన్ మతాన్ని ఈ విధంగా దుశిస్తారా లేక వెతిరేకంగా ప్రచారం చేయగలరా అంటున్నారు . ఈ దేశం లో ఈ రెండు మతాలూ ,సిక్కు  మతాలు మైనారిటీ అంటే తక్కువ ప్రజలు ఉన్న మతాలు . ఈ మతాలూ ఏవీ వివక్ష పాటించదు. ఇక్కడ కుల గోత్రాలు ఉండవు. అందరు సమానమే .ఆ మద్య ఆంధ్రజ్యోతి TV ఛానల్ BIG DEBATE ఎడిటర్ రాధా క్రిష్ణ గారు చివరిగా అడిగిన ప్రస్నా " మీరు ఈ అంటారని తనాని వదులుకుంటారా అంటే ఎవరు సరియిన సమాదానం చెప్పలేక పోయారు . చివరికి అయిన మీ ఖర్మ అంటూ ఆ debate ని ముగించేడు . అందులో పాల్గొన్న మన రాష్ట్ర మాజీ పోలీసు బాస్ కుడా ఒక్క వాక్య చేసేడు ,నాలాంటి వారికీ కుడా స్వామిజి ని తాకే అర్హత లేనప్పుడు ఇంకా సామన్య మనిషికి మీరు ఏవిధంగా దగ్గర అవుతారు అనేదానికి సమాదానం లేదు. అయితే ఇక్కడ మన మత పెద్దలు ఒక్క తెలివైన వాదనని ముందుకు తీసుకు వస్తున్నారు . వేదాలలో ఈ అంటరానితనం లేదు వ్యాసుడు దగ్గరనుండి రాముడు శబరి ఎంగిలి తినేవరకు చెబుతారు .ఇంకొంచం ముందుకు వెల్లి ఆది గురువు శంకరాచార్యులు జ్ఞానోపదేశం గురించి చెబుతారు .నిజమే అవి అన్ని అక్షరాల సత్యమే కాని, మరి వారి శిష్యులు వారి బోదనలు ప్రచారం చేసే ఈ నాటి సమాజానికి ఏమైంది . ఎందుకు ముషులను వేరుగా చూస్తున్నారు .వర్ణాలు , వర్గాలు గా ఎందుకు సమాజాన్ని ఎందుకు విడగొట్టేరు ? ఈ ప్రశ్నలకి ఎక్కడ సమాదానం దొరకదు. జ్ఞానం ఉన్న వాళ్ళ అందరు బ్రాహ్మణులు అయితే శూద్రులకు ఎందుకు మీరు చదువునుండి దూరం చేసేరు ,వాళ్ళను బానిసలలాగే చూసేరు , వేదం చదవటానికి శూద్ర కులాలకి ఎందుకు అర్హతలేకుండా పోయింది . 

ఇంకా చెప్పాలి అంటే అది వాళ్ళ ఖర్మ అంటారు ఖర్మ సిద్దాంతం ప్రకారమే ఎవరి ధర్మాలు వారు పాటిస్తున్నారు అంటారు , ఇంకా ఈ సాంకేతిక విప్లవ , ప్రపంచీకరణ లో ఈ ఖర్మ సిద్దాంతం పనిచేస్తుందా ? కొంతమందిని దూరంగా పెట్టి అది నీ ఖర్మ అంటే మీ మనసాక్షి , మీ ధర్మం ఒప్పుకుంటుందా !?. మీ మత ధర్మం ఒప్పుకోనప్పుడు ఖచితంగా వారు వేరే దారి చూసుకుంటారు , వేరే మత మార్గాన్ని అనుసరిస్తారు అప్పుడు మనం గగ్గోలు పెట్టుకున్న లాభం లేదు . వేరే వాళ్ళను నిందించే కంటే మన తప్పులను ఇకనైనా సరిదిద్దుకోవాలి .అప్పుడు వేరే మతం మన దరి  దాపులకు కుడా   రావటానికి బయపడతారు .

ఈ మద్య ఒక్క TV ఛానల్ లో నిర్వహించిన ధార్మిక సమ్మేళనం లో ఒక్క స్వామిజి వారు " హిందూ " అనే పదాన్ని ఇతర బాషలలో దాని యొక్క అర్ధాన్ని తప్పుగా ప్రచురిస్తున్నారు అని మనం ఆ ' హిందు"  అనే మాటను మర్చుకుందాం అని చర్చకు తెరతీసేరు . ఎవరో ఇతర మతస్తులు , ఇతర దేశ స్కాలర్స్ మన ధర్మం గురించి తప్పుగా రాస్తే పెద్దలు దానిని సమర్దంగా ఎదురుకోవాలి కాని ఇలా ఎలా మార్చుకుంటాం . తర తరాలుగా హిందు ధర్మం లేదా మతం మీద దాడి జరుగుతుంది దానికి మనం వర్ణాలతో ,వర్గాలతో  ఉతకర్రను ఇస్తున్నాం . ముక్యంగా ఈ మతం లో ఆదిపత్య వర్గం తమ సహజ సిద్దమైన అహంకార తనం వలన ఇతర నిమ్న కులాలు ఈ మత ధర్మం నుండి దూరం అవుతున్నారు  అనేది గ్రహించాలి ,ఆ ప్రజల నుండి ఆ బావన తొలగించి వాళ్ళకు ' హిందు మత ధర్మం 'లో బాగస్వామ్యం కలిపిస్తే ఏ అన్య మతం నుండి హిందు మతానికి మన దేశంలో ప్రమాదం రాదు .

29, జూన్ 2012, శుక్రవారం

ప్రాజెక్ట్ భూతం

చరిత్ర ఎప్పుడు అబద్దం చెప్పదు. చరిత్ర మరల , మరల రిపీట్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నిర్వాసితులకు కలిపించాల్సిన వసతులు , వాళ్ళ హక్కులను గౌరవించాల్సిన విషయం లో ప్రభుత్వాలు ధగకోరుతనం గా నే ప్రవర్తిస్తున్నాయి . ఎవరిని మోసం చేస్తుంది ఈ ప్రజా ప్రబుత్వాలు . ప్రజలనినా లేక దేశాన్న ?


వైజాగ్ , సింహాద్రి NTPC ధర్మల్ పవర్ ప్లాంట్ అవసరాల కోసం ప్రభుత్వ హామీలను నమ్మి తమ జీవనాదారం వదులుకొని జీవిస్తున్న ప్రజలకు ప్రభుత్వాలు ఖచితంగా అంతకు మించి జీవన ఉపాది కలిపించాలి . భారత దేశం లో భూమి జీవితం ,అజీవితన్నే ప్రజా ,దేశ అభివృద్దికి ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిపించాల్సిన బాద్యత ప్రభుత్వానిది , పాలితులది . భూమి , ఉపాది కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వ లేక ఆయా ఖర్మగారాలలో ఉద్యోగం ఎప్పటికి సమానం కాదు ,కానీ జీవించాలి ,జీవించేందుకు మార్గం కావాలి , ఆ మార్గాన్నే ప్రజలు కోరుకుంటుంది .
మన రాష్ట్రము లో ఈ పునరావాస హామీలు అన్ని నీటి మూటలే, ఆనాటి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం , నేటి సింహాద్రి NTPC వరకూ అంతా మోసమే . పునరావాసం పేరుతొ భలవంతపు , నిర్బంద settlements జరుతున్నాయి . ఇంకా చెప్పాలి అంటే ప్రజలు తమ సాంఘిక , సాంస్కృతిక జీవిత విదానాన్ని వదులుకొని తమ భూమిని ప్రాజెక్ట్ లకు ఇస్తున్నారు. 

భూమి కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్ధిక సహాయం దయతో చేస్తున్నట్టు గా ఉంది కానీ ప్రభుత్వ కనీస ధర్మం గా ఆలోచించటం లేదు . ఈ విషయం లో ప్రభుత్వం కొన్ని గ్రూప్ లుతో కుమ్మక్కు అయి ప్రజలను తమ పోలీసు బలగం తో అణిచి వేస్తున్నాయి . ప్రజలను తీవ్రవాదులుగా చూస్తున్నాయి .పాలకులు ఈ పెడదోరని వీడాలి లేకుంటే ముందు ముందు ఈ దేశం లో ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చే పరిస్తితి లేదు ఇంకా చెప్పాలి అంటే అది దేశ అభివృద్ధికే ఆటంకంగా మారుతుంది .

నిన్న సింహాద్రి NTPC నిర్వాసితుల పై జరిగిన కాల్పులను ఖండిస్తూ ..ప్రబుత్వ దోరణి కి నిరసిస్తున్నాం .

28, జూన్ 2012, గురువారం

భర్త -శత్రువు లేదా స్నేహితుడు !


పెళ్లి - స్వర్గం లో నిర్ణయించ బడింది అని అనుకుంటూ ఉంటాం . ఇంకా కొంతమంది తమ భార్య , భర్త దేవుడు ఇచ్చిన వరం అనుకుంటూ ఉంటాం. 
భార్య - కుటుంబం లో ప్రదాన పాత్ర దారి !  మన భారతీయ సంస్కృతీ లో లేదా మన సమాజం లో " భర్త మాట జవదాటని స్త్రీ " అనుకోవాలి .దాదాపుగా ఇది నిజం కుడా .ఇందుకు మనకు చెప్పుకోవటానికి చాల ఉదాహరణలు ఉన్నాయి . అనాటి 'సీత' నుండి మన ఇంటిలో ముసలి జీవి మన బామ్మా గారి వరకూ ఉదాహరణలే . ఇంకా చెప్పుకోవాలి అంటే భర్త దైవం తో సమానం . ఉత్తర బారత దేశం లో ఇప్పటికి భర్త పాదాలను పూజించే స్త్రీలు ఉన్నారు .సీత భర్త మాట కాదు అనలేక అడవిలో కష్టాలు పడింది , అగ్నిగుండంలో దూకింది . వ్యసనానికి భానిస అయి కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టినప్పుడు ,నిండు సభలో తల దించుకొని అవమానం పడిందే కానీ భర్త మాట వెతిరేకించలేదు . " సీత , సావిత్రి , చంద్రమతి , ద్రౌపతి ,అనసూయ " వీళ్ళు అందరు నేటి భార్యలకు ఉదాహరణలే అమ్మ - అమ్మ దగ్గరనుండి , పుస్తకాల వరకూ వీరు మన స్తీలకు ఉదహరణ లే వీళ్ళ కు మనం పెట్టుకున్న పేరు " పతివ్రతలు "

ఈ కలియుగం లో అందున ఆధునికి నవ యుగంలో భార్యలు ఇంకా భర్త మాట జవదాటడం లేదా అంటే అవును అనే చెప్పాలి . సంఘం లో గౌరవం కోసమో , సంతోష ల కోసమో , సరదాల కోసమో భర్త డబ్బులు తెస్తుంటే ఆనంద పడతారు కానీ చివరికి అతను మోసపూరితంగా డబ్బులు సంపాదించాడు అని జైలో పెట్టినప్పుడు ఆ భార్య మానసిక వేదన అతి భయంకరం . చెడు వ్యసనాలకు బానిస అయి తర తరాల ఆస్తిని పోగొట్టి , చివరికి మంగళ సూత్రం కుడా అడిగే భర్తకు మౌనం గానే తీసి  ఇచ్చే భార్య , తన క్షనికానందం కోసం వీధులు వెంట తిరిగి చివరకు అత్యంత ప్రమాదకర AIDS వ్యాదిని అంట కట్టే ప్రబుద్దులు ఉన్నారు . 
అయితే ఇందులో భార్యల భాగస్వామ్యం యెంత అనేది మనం చర్చికోవాలి . కానీ మనకు ఇక్కడ ఒక్క పెద్ద అతివాద సూక్తి ఒక్కటి ఉంది అదే బయట విషయాలు ఇంటిలో చర్చించా కూడదు . అది డబ్బుతో కూడుకున్న పని కాని ఇంకా ఎదియినా కానీ . ఈ ఒక్క సూత్రాన్ని అడ్డం పెట్టుకుని భర్త తన  పబ్బం గడుపుకుంటున్నాడు. అయితే నేను భార్యలకు చెప్పేది భర్తలను అనుమానించా మనటం లేదు గుడ్డి గా మాత్రం సపోర్ట్ చెయ్యవద్దు అంటున్న .

మనం ఇప్పుడు లోతుగా వెళ్లి చర్చించ నక్కరలేదు కాని  men prove to be very persuasive and secretive.   
A family relationship consultant quoting that “If the wife is in connivance or out of the loop, she cannot abdicate her responsibility. She should delicately put forward her misgivings and make her what to the core of her doubts.”

So the 21st century women should not be part and parcel of your husband’s ugly things.

27, జూన్ 2012, బుధవారం

నాయకుడు .


ఈ మద్య కాలం లో మన రాష్ట్రము లో ఒక్క విచిత్ర సంఘటన ఆరు నెలలకి ఒక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులూ చలో డిల్లీ అంటూ గుంపులు గుంపులు గా వెళ్తున్నారు కొంత మంది ఎవరికి కనిపించకుండా , బహుశా బార్య పిల్లలకు కూడా చెప్పకుండా వెళ్తున్నారు అనుకుంటా ! కొంత మంది ఏమో ధూం - ధాం అంటూ ఈ రోజూ రేపో తేల్చుకొని వస్తాం అని చెప్పి డిల్లీ విమానం ఎక్కేస్తున్నారు .అసలకు ఎందుకు ఈ పరిస్తితి వస్తుంది . దీనిని ఏమైనా " డిల్లీ మానియా " అంటారా లేక ఇంకేదైనా కొత్త రకం పేరు ఏమైనా ఉందా !
సరిగ్గా ఇలాంటి పరిస్తితే అప్పుడు ఒక్క సినిమా నటుడు తెలుగు వాడి ఆత్మ గౌరవం అని ఒక్క పార్టి పెట్టి ఈ దేశం లో తెలుగు వాడికి ఒక్క గుర్తింపు తెచ్చేడు . ప్రాంతీయ పార్టీలకు ఈ దేశంలో మార్గదర్సకుడు మన తెలుగు వాడు అయ్యాడు , కానీ ఇప్పుడు మరల అదే గోల . బహుశా కాంగ్రెస్ పార్టి లక్షణం అనుకుంటా ? కానీ గత కాంగ్రెస్ (2004 to 2009 ) ప్రభుత్వ కాలం లో ఏమి జరిగిందో ఏమో కానీ ఆ యాత్రలు బహుశా లేవు అని చెప్పవచ్చు . దీని అంతటికి కారణం " లీడర్ " -  నాయకుడు లేకపోవటం .
అధినాయకత్వం ' నాయకులను ' తాయారు చెయ్యటానికి తమ శక్తి వంతం లేకుండా ప్రయత్నిస్తుంది , అరువు కూడా తెచ్చు కుంది , ప్రజలు గుర్తించటం లేదు . నాయకుడు బొమ్మ కాదు తయారు చెయ్యటానికి , నాయకుడు సహజంగా పుట్టాలి , ప్రజల హృదయ స్పందన నుండి రావాలి అప్పుడే చరిత్ర గుర్తిస్తుంది ...చనిపోయిన జనం హృదయంలో జీవిస్తూ ఉండాలి అతడే నిజమైన నాయకుడు . 



23, జూన్ 2012, శనివారం

కుల రాక్షసి


" కులం పునాదుల పై ఈ దేశాన్ని నిర్మించలేరు" Dr  బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అక్షరాల సత్యం. దీనికి మరో ఉదాహరనే గత వారం ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షంపేట గ్రామం లో జరిగింది . కులం పేరుతొ సమాజాన్ని దారుణంగా , మానవత్వం మరచి పోయి నరికి వేసేరు ." భూమి " ఈ దేశం లో పేదవాడికి ఇంకా చెందనిది ఇంకా చెప్పాలి అంటే దళితులకు చెందనిది.

లక్షంపేట మారణ కాండ ని మనం ఏమి అని నిర్విన్చుదాం. ఇది జరిగినది ఒక్క భూమి కోసమేనా , లేక భూమి చాటున కుల వివక్షనా ! ఇది ముమ్మాటికి కుల దురహంకారమే. ఈ దురహంకారమే ఇంత మంది  ఉచకోతకు గురి అయింది. ఆనాటి కారంచేడు నుండి నేటి లక్షంపేట వరకు జరిగన మారణ కాండకు ఒక్కటే మూలం భూస్వామ్య , అగ్రకుల వ్యవస్థ . 65 years భారత చరిత్రలో కులం పేరుతొ ఇంకా వివక్ష బహుశా జాతి మొత్తం సిగ్గు పడవలిసిన విషయం . ఒక్క వైపు ప్రపంచం మొత్తం ఒక్క గ్రామం గా ఉంటుంటే ఈ దేశం మాత్రం ఇంకా కులం పునాదులపై నిర్మాణం అవుతుంది . అప్పుడు .అప్పుడు కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చిన తర తరాలు గా వచ్చిన ఈ జాడ్యం రోజు రోజుకు పెరుగుతుంది .నాపక్కన ఒక్క దళితుడు వ్యవసాయం చెయ్యకూడదు అనే సాకుతో , ఆ భూమిని తమ ఆదీనం లోకి తెచ్చుకోవటమే ఈ " నయ అగ్రవర్ణ " వ్యక్తులు మనిషిని చంపింది. అయితే మనం ఇక్కడ Dr బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలి . " ఈ దేశం లో రాబోయే తరంలో అగ్రవర్ణాలు కంటే శూద్ర కులం నుండే దళితులకు పెను ప్రమాదం . బహుశా  ఇది నిజమే అవుతుంది ఇప్పుడు. అవును లక్షంపేట దళితుల మీద దాడి చేసిన వ్యక్తులు వెనకబడిన కులం వాళ్ళే, అయితే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్తలో ......కాపులు తమని తాము అగ్రకులం గా అనుకుంటూ ఉంటారు . 

మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నప్పుడు భారతదేశం ప్రజాస్వామ్య ,సోషలిస్ట్ ,లౌకిక దేశం గా చెప్పుకున్నాం. కానీ ఇంకా ఈ కుల వ్యవస్థ మన సమాజం మీద దాడి చేస్తూనే ఉంది. గుర్రం జాషువా చెప్పినట్టు ' పాముకు పాలు, చీమకు పంచదార' పెట్టి పెంచే మన ఖర్మ భూమిలో సాటి మనిషిని మనిషి గా చూడకుండా వివక్షకి , అవమానాలకు ,హత్యలకు తెగబడుతున్నారు .
ఈ అనాగరిక మారణ కాండకు ఎవరు భాద్యత వహిస్తారు ? సామాజిక న్యాయం మాకే సాద్యం అని ఉకడంపుడు ప్రసంగాలు వొట్టి నీటి రాతలేన? 

కులములోన నొకడు  గునహీనుడు నుండిన 
కులము చెడు  వాణి  గుణము  వలన  
వెలయు జేరుకునందు వెను వెడలి నట్లు 
విశ్వదాభిరామ ..వినుర వేమ.


17, జూన్ 2012, ఆదివారం

రాజకీయ - సామజిక సమీకరణలు.- ఆంధ్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కాబోతుంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ప్రక్యాత సినిమా నటుడు NT రామారావు తెలుగు దేశం పార్టి ఆవిర్భవించినప్పుడు ఒక్క క్రొత్త రాజకీయ వరవడిని సృష్టించి వెనకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకుని ఈ రాష్ట్రంలో ఒక్క పెను ప్రభంజనం సృష్టించింది . పేరుకు తెలుగు వాడి ఆత్మగౌరవం తో ఏర్పడిన దాని మూలం మాత్రం సామజిక కుల సమీకరణము మాత్రమే . ఆనాటి నుండి నేటి వరకు అవర్గము అది తమ సొంత పార్టి గా అనుకుంటూ వచ్చారు . వెనకబడిన తరగతులను ప్రోస్తాహించటం వలన ఆపార్టి మనుగడ సాధిస్తూ వస్తుంది . ఇదేసందర్బం లో జాతీయ కాంగ్రెస్ ఆంద్ర రాష్ట్రం లో రెడ్డి సామజిక వర్గం నాయకత్వం లో మిగత దళిత ,ముస్లిం కులాలు తమ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్నారు .
అయితే ఇటీవల కాలం లో Dr వై ఎస్ రాజశేకర్ రెడ్డి ముక్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో చాల వర్గాలకు తను వ్యక్తి గతంగా చాల దగ్గర అయ్యేడు . అతినిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. అయితే రాజశేకర్ రెడ్డి గారు అకాల మరణం తరువాత ఈ రాష్ట్రం లో రాజకీయ ,సమజకంగా పెను మార్పులు సంభవించాయి. రాజశేకర్ రెడ్డి తనయుడు వివిధ కారణాలన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టి స్తాపించటం , రాజశేకర్ రెడ్డి ని అభిమానించే కొంతమంది MLA లు ఆ పార్టికి మద్దతు ఇవ్వటం ,అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టి కి వెతిరేకంగా అవిస్వాసతీర్మానానికి మద్దతు పలకటం , తమ అధికారం కోల్పోయి మరల వై ఎస్ జగన్ స్తాపించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి నుండి ఎన్నికలకు వెళ్ళటం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల లో ఒక్క గొప్ప మార్పుని మనం గమనించాలి. మొత్తం 18 అసెంబ్లీ , ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం లో అధికార కాంగ్రెస్ పార్టికి 5 స్తానలలో ధరావత్తు కోల్పోవటం , ప్రతిపక్ష తెలుగుదేశం కొన్ని చోట్ల ధరావత్తు కోల్పోవటం ఇక్కడ మనం చర్చించుకోవాలి . అసలికి ఈ ధరావత్తు కోల్పోవటానికి ప్రధాన కారణం ఏంటి ? అనేది మనం విశ్లేషించుకుంటే తర తరాలుగా వస్తున్న ఓటు బ్యాంకు వరద వచ్చి కొట్టుకు పోయినట్టుగా కొత్త పార్టి , కొత్త నాయకత్వం వైపు మొగ్గు చూపింది . కాంగ్రెస్ కి పెట్టని కోట లాగా ఉన్న దళిత ,ముస్లిం మైనారిటీ వర్గాలు మరియు తెలుగు దేశానికి మొదటినుండి ఆయువు పట్టుగా ఉన్న BC ఓటర్లు 7 నుండి 8 శాతం తగ్గిపోవటం ఆ రెండు పార్టీలకు ధరావత్తు కోల్పోవటానికి ప్రదాన కారణం . ఈ వర్గాలకు ధరలు పెరగటం కాని , అవినీతి అక్రమాలు కానీ , జాతీయ రాజకీయ సమీకరణాలతో పనిలేదు. నమ్మకం , ఈ పార్టి నాయకత్వం లో మేము క్షేమంగా ఉండగలం అనే విశ్వాసం . ఏది ఏమి అయిన మన రాష్ట్రం లో ప్రదానం గా కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి సామాజక  వర్గం నుండి బలిజ - కాపు సామజిక వర్గం వైపునకు , తెలుగు దేశం తమ ఖమ్మ సామజిక వర్గం మరియు కొంత BC వర్గాలను , కొత్త గా ఆవిర్భవించిన వై ఎస్ ర్ కాంగ్రెస్ రెడ్డి , దళిత ,ముస్లిం, మైనారిటీ వర్గాల పార్టీల మాదిరిగా సమీకరణలు మారిపోతున్నాయి.అయితే ఇక్కడ మిగత సామజిక వర్గాలను , మరియు BJP , TRS పార్టి ల గురించి ఆలోచించాలి . BJP  కి రాష్ట్రం లో సరి అయిన నాయకత్వం లేకపోవటం వలన తమకి అనుకూలమైన వర్గాలను ఆకర్షించ లేక పోతుంది. అలాగే TRS ఒక్క ప్రాంతానికే , ఒక్క అంశానికే పరిమితి అవటం మనం ఇక్కడ గుర్తుఉంచుకోవాలి . అయితే TRS ని వెలమ సామజిక వర్గ పార్టీగా ముద్రవేయటానికి కొంతమంది ప్రయత్నించిన TRS ఆ విమర్శ నుండి సులభంగా బయట పడుతుంది .  అయితే ఈ  సమీకరణలు ముందు ముందు ఇలాగె ఉంటాయ లేదా అనేది ఆయ పార్టీల రాజకీయ సమీకరణ , వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమ కార్యక్రమాల బట్టి కాలం నిర్ణయిస్తుంది .