3, జులై 2012, మంగళవారం

హిందూ మతం ప్రమాదం లో ఉందా !


ఈ మద్య మీడియా లో ఈ రకమైన చర్చ చూస్తున్నాం , ఎవరు అయితే హిందూ ధర్మానికి ( మతం ) పెద్దలగా ఉన్నారో, అలాగే స్కాలర్స్ , స్వామీజీ లు ,పూజారులు ఇంకా మతానికి సంబందించిన పెద్దలు హిందూ మతానికి లేదా ధర్మానికి ఈ దేశం లో ప్రజలు దూరము అవుతున్నారు , అన్యమతనికి ఆకర్షింప బడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు . అసలకి హిందూ మతం నుండి ఎందుకు ఇతర మతం లోకి వెళ్ళుతున్నారు అని ఎవరు ప్రశ్నించటం లేదు . మనలో లోపం ఏంటి ,ఎందుకీ దుస్తితి అని ఏ మత పెద్ద కాని ,స్వామిజి లు కాని ప్రశ్నించటం లేదు . గొడ్డును (బీఫ్ ) ని చంపితేనే హాహాకారాలు చేస్తున్న ఈ పెద్ద మనుషులు , సాటి మనిషిని ఎందుకు గౌరవించటం లేదు .మీ అందరకి ప్రత్యేకమైన గోత్ర నామాలు ఉన్నప్పుడు ఇతర కులాల వారికీ ముక్యంగా దళితులను ఎందుకు గౌరవించటం లేదు . పశువు కంటే హీనమా ?. ఆలోచించండి మత పెద్దలారా . తర తరాలుగా హిందూ మతం / ధర్మాన్ని ఆచరిస్తున్న దళితులు , గిరిజనులు ఇంకా గ్రామాలలో ఉన్నారు .మీ అవివేకం తో వారినికూడా దూరం చేసుకోవద్దు . ఎవరు ఈ రోజులలో డబ్బుకోసం . పాలు, రొట్టె కోసం మతం మారుతున్నారు అంటే అది మీ బ్రమే. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడు ఖచితంగా వేరే మార్గం ఆలోచిస్తారు .

ఇంకొక ప్రధాన వాదన ఈ గ్రూపు సబ్యులు మిగత వాళ్ళ మాటలకూ ప్రేరణ కలిగిన ప్రజలు ముస్లిం , క్రిస్టియన్ మతాన్ని ఈ విధంగా దుశిస్తారా లేక వెతిరేకంగా ప్రచారం చేయగలరా అంటున్నారు . ఈ దేశం లో ఈ రెండు మతాలూ ,సిక్కు  మతాలు మైనారిటీ అంటే తక్కువ ప్రజలు ఉన్న మతాలు . ఈ మతాలూ ఏవీ వివక్ష పాటించదు. ఇక్కడ కుల గోత్రాలు ఉండవు. అందరు సమానమే .ఆ మద్య ఆంధ్రజ్యోతి TV ఛానల్ BIG DEBATE ఎడిటర్ రాధా క్రిష్ణ గారు చివరిగా అడిగిన ప్రస్నా " మీరు ఈ అంటారని తనాని వదులుకుంటారా అంటే ఎవరు సరియిన సమాదానం చెప్పలేక పోయారు . చివరికి అయిన మీ ఖర్మ అంటూ ఆ debate ని ముగించేడు . అందులో పాల్గొన్న మన రాష్ట్ర మాజీ పోలీసు బాస్ కుడా ఒక్క వాక్య చేసేడు ,నాలాంటి వారికీ కుడా స్వామిజి ని తాకే అర్హత లేనప్పుడు ఇంకా సామన్య మనిషికి మీరు ఏవిధంగా దగ్గర అవుతారు అనేదానికి సమాదానం లేదు. అయితే ఇక్కడ మన మత పెద్దలు ఒక్క తెలివైన వాదనని ముందుకు తీసుకు వస్తున్నారు . వేదాలలో ఈ అంటరానితనం లేదు వ్యాసుడు దగ్గరనుండి రాముడు శబరి ఎంగిలి తినేవరకు చెబుతారు .ఇంకొంచం ముందుకు వెల్లి ఆది గురువు శంకరాచార్యులు జ్ఞానోపదేశం గురించి చెబుతారు .నిజమే అవి అన్ని అక్షరాల సత్యమే కాని, మరి వారి శిష్యులు వారి బోదనలు ప్రచారం చేసే ఈ నాటి సమాజానికి ఏమైంది . ఎందుకు ముషులను వేరుగా చూస్తున్నారు .వర్ణాలు , వర్గాలు గా ఎందుకు సమాజాన్ని ఎందుకు విడగొట్టేరు ? ఈ ప్రశ్నలకి ఎక్కడ సమాదానం దొరకదు. జ్ఞానం ఉన్న వాళ్ళ అందరు బ్రాహ్మణులు అయితే శూద్రులకు ఎందుకు మీరు చదువునుండి దూరం చేసేరు ,వాళ్ళను బానిసలలాగే చూసేరు , వేదం చదవటానికి శూద్ర కులాలకి ఎందుకు అర్హతలేకుండా పోయింది . 

ఇంకా చెప్పాలి అంటే అది వాళ్ళ ఖర్మ అంటారు ఖర్మ సిద్దాంతం ప్రకారమే ఎవరి ధర్మాలు వారు పాటిస్తున్నారు అంటారు , ఇంకా ఈ సాంకేతిక విప్లవ , ప్రపంచీకరణ లో ఈ ఖర్మ సిద్దాంతం పనిచేస్తుందా ? కొంతమందిని దూరంగా పెట్టి అది నీ ఖర్మ అంటే మీ మనసాక్షి , మీ ధర్మం ఒప్పుకుంటుందా !?. మీ మత ధర్మం ఒప్పుకోనప్పుడు ఖచితంగా వారు వేరే దారి చూసుకుంటారు , వేరే మత మార్గాన్ని అనుసరిస్తారు అప్పుడు మనం గగ్గోలు పెట్టుకున్న లాభం లేదు . వేరే వాళ్ళను నిందించే కంటే మన తప్పులను ఇకనైనా సరిదిద్దుకోవాలి .అప్పుడు వేరే మతం మన దరి  దాపులకు కుడా   రావటానికి బయపడతారు .

ఈ మద్య ఒక్క TV ఛానల్ లో నిర్వహించిన ధార్మిక సమ్మేళనం లో ఒక్క స్వామిజి వారు " హిందూ " అనే పదాన్ని ఇతర బాషలలో దాని యొక్క అర్ధాన్ని తప్పుగా ప్రచురిస్తున్నారు అని మనం ఆ ' హిందు"  అనే మాటను మర్చుకుందాం అని చర్చకు తెరతీసేరు . ఎవరో ఇతర మతస్తులు , ఇతర దేశ స్కాలర్స్ మన ధర్మం గురించి తప్పుగా రాస్తే పెద్దలు దానిని సమర్దంగా ఎదురుకోవాలి కాని ఇలా ఎలా మార్చుకుంటాం . తర తరాలుగా హిందు ధర్మం లేదా మతం మీద దాడి జరుగుతుంది దానికి మనం వర్ణాలతో ,వర్గాలతో  ఉతకర్రను ఇస్తున్నాం . ముక్యంగా ఈ మతం లో ఆదిపత్య వర్గం తమ సహజ సిద్దమైన అహంకార తనం వలన ఇతర నిమ్న కులాలు ఈ మత ధర్మం నుండి దూరం అవుతున్నారు  అనేది గ్రహించాలి ,ఆ ప్రజల నుండి ఆ బావన తొలగించి వాళ్ళకు ' హిందు మత ధర్మం 'లో బాగస్వామ్యం కలిపిస్తే ఏ అన్య మతం నుండి హిందు మతానికి మన దేశంలో ప్రమాదం రాదు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి