తెలుగు జానపద కథలలో మనం విన్నాం జలకన్య గురించి బ్లాక్ & వైట్ సినిమాలో ఆ మధ్య ధర్సకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా పొడుగు కాళ్ళ సుందరి శిల్ప శెట్టి తో జలకన్య సినిమా తీసేరు. సగం మనిషి సగం చేపను పోలిన ఈ జలకన్య ఇంగ్లీష్ వాళ్ళు ముద్దు గా మేర్మయిడ్ అని పిలుచుకునే ఈ కన్య అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఆమె చుట్టూ ఎన్నో కథలు.
అయితే ఆ జలకన్య అసలు వీడియో మా వద్ద ఉంది అంటూ యు టూబ్ లో పెట్టేరు. అసలే జల కన్య ఇంకేముంది నవంబర్ 24 తేదిన యు టూబ్ లో పెట్టేసరికి నెల తిరిగే లోపల 3.12 కోట్ల మంది ఆ విడియో ని చూసేరు , షేర్ చేసేరు. తీర ఆ వీడియో పూర్తి అయ్యేసరికి అసలు విషయం తెలుసుకుని జనం అవాక్ అయ్యేరు.
ఉత్సాహం మరియు పకృతి ప్రేమికులు ప్రస్తుతం మన భూగోళం లో జరుగుతున్నవాతావరణ మార్పులు గురించి ప్రజలను చైతన్య పరచటానికి ఆ విడియో ని పోస్ట్ చేసేరు. "ప్రస్తుతం జల కాలుష్యం , లేదా వాతావరణ కాలుష్యం ఇలాగే ఉంటే కొన్ని రోజులకు సముద్రం లోని చేపలు ఇలా వింత జంతువులాగా మారుతుంది" అంటూ చివరిగా సందేశం ఇచ్చేరు ఆ వీడియో లో. జలకన్య ని చూద్దాం అని ఆశగా వీడియో ని క్లిక్ చేసిన ప్రజలకు నిరాస కలిగిన వాతావరణ కాలుష్యం గురించి కాస్త ఆలోచించే విధంగా చేసింది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి