20, డిసెంబర్ 2015, ఆదివారం

నేషనల్ హెరాల్డ్



ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.కొన్ని గంటల క్రితం బారతీయ మీడియా లో ఇదే చర్చ , ఎవరినోట విన్నా "నేషనల్ హెరాల్డ్ "
అసలు ఎవరీ నేషనల్ హెరాల్డ్? ఎందుకు బారతీయులు అంత గా దీని మీద చర్చిస్తున్నారు.?
అది స్వతంత్ర పోరాటం ఉదృతంగా జరుగుతున్నా కాలం. ఆరోజుల్లో పత్రిక ఆవశ్యకత గుర్తించి జవహర్ లాల్ నెహ్రు సెప్టంబర్ 9, 1938 లక్నో లో  దీనిని స్తాపించేరు. నెహ్రు ప్రదాని అయ్యేంతవరకు ఆయనే పత్రిక ఎడిటర్ గా పనిచేసేరు. ఆ తరవాత కె. రామా రావు కి ఎడిటర్ గా బాద్యతలు అప్పగించేరు. ఆగస్ట్ 1942, క్విట్ ఇండియా రిజల్యుషన్ వలన బ్రిటిష్ ప్రబుత్వం మొదటి సారిగా 1942 - 1945 పత్రికకు తాళం వేసేరు. 1945 లో మళ్ళీ ఇందిరాగాంధీ బర్త ఫిరోజ్ గాంధీ మేనేజింగ్ డైరెక్టర్ గా తిరిగి ప్రరంబించేరు. ఫిరోజ్ గాంధీ  సారధ్యం లో 1950 వరకు పత్రిక పనిచేసింది. ఇదే సమయం లో పత్రిక కొంత ఆస్తులను కూడా బెట్టుకుంది.1946 నుండి 1978 వరకూ మనికొండ చలపతి రావు పత్రికకు ఎడిటర్ గా పనిచేసేరు. ఆ సమయం లో నెహ్రు చలపతి రావు కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేరు. కొన్ని రోజులు నెహ్రు అంతర్జాతీయ వార్త సేకరణదారుడు గా పనిచేసేరు. 

నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ కి మౌత్ పీస్ గా పనిచేస్తూ ఉండేది. శ్రీమతి ఇందిరా గాంధీ సమయం లో పత్రిక రెండుసార్లు ముసివేసేరు. 1977 లో ఇందిరా గాంధీ ఓడిపోయినప్పుడు , మరియు ఎమర్జన్సీ సమయం లో. 1986 లో మళ్ళీ మూసి వేసే స్తితికి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ దీనికి కొంచెం ఆర్ధిక పరిపుష్టి కల్గించెరు. 1998 లో లక్నో ఎడిషన్ ముసివేసేరు అప్పుడు కొన్ని ఆస్తులు అమ్మి అప్పులు తీర్చేరు. అయితే 2008 లో " నేషనల్ హెరాల్డ్ " ని శాస్వితంగా సోనియా గాంధీ , రాజీవ్ గాంధీ సారధ్యం లో ముసివేసేరు. 
అయితే అసలు వివాదం ఏంటి ? ఎందుకు ఇప్పుడు ఇది ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. 
125 సంవత్సరాల కాంగ్రెస్ -నెహ్రు - గాంధీ చరిత్రలో కాంగ్రెస్ రధసారదులు మొదటి సారిగా కోర్టు మెట్లు ఎక్కటమే ఇప్పుడు ఇది ప్రజల లలో చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇందులో వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు సోనియా , రాహుల్ గాంధీ లు కోర్టు మెట్లు ఎక్కేరు ? 
నేషనల్ హెరాల్డ్ Associated Journal Ltd ( AJL ) అనే సంస్త కింద పని చేస్తూ ఉంటుంది ఇందులో మెజారిటీ షేర్ హోల్డర్స్ అంతా కాంగ్రెస్ నాయకులే. అయితే రూ 5000 కోట్లు ఆస్తులు కలిగిన నేషనల్ హెరాల్డ్ ని సోనియా , రాహుల గాంధీ నేతృత్వం వహిస్తున్న Young India Limited కారుచౌకగా రూ 50 లక్షలే చెల్లించి సొంతం చేసుకుంది ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్టు బాజాపా నాయకుడు ఒకప్పటి జనతా పార్టి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి కేసు పెట్టి విచారిన జరపాల్సిందిగా కోరేరు. ఇదే కేసులో కొన్ని గంటలు క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటియాలా కోర్టు మెట్లు ఎక్కేరు. దేశ ప్రజలంతా ఊపిరి బిగపట్టి కోర్టు నిర్ణయం కోసం చూసేరు. అయితే వుహించినట్టే కోర్టు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ కి బెయిల్ ఇచ్చేరు. 

కాంగ్రెస్ పార్టి కి కాని , నెహ్రు - గాంధీ కుటుంబానికి కాని ఇది పెద్ద గుణపాటం గా మెజారిటీ ప్రజల అభిప్రాయం. కోర్టు నిర్ణయం వరకూ పెద్దగా
కాంగ్రెస్ మీద జాలి కలగ లేదు. అయితే ఈ సంఘటన ను కాంగ్రెస్ కాని గాంధీ - నెహ్రు కుటుంబం తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం లో కొంత సఫలీకృతం అయ్యేరు అని చెప్పవచ్చు. కోర్టు నుండి  నేరుగా పార్టి ఆఫీసు కు చేరుకున్న అమ్మ - కొడుకు మరియు యావత్ కాంగ్రెస్ పెద్దలు మీడియా తో మాట్లాడుతూ " న్యాయవ్యవస్త మీద నమ్మకం ఉంది , బారతీయులుగా మేము బారత్ న్యాయవస్తను గౌరవించి కోర్టుకు వెళ్లేము " అని తమ వాదన కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నం చేసేరు. ఇదే సందర్భం లో కేంద్రం లోని బాజపా పార్టి రాజకీయ కక్షసాధింపు చర్యలు చేస్తుంది అంటూ సోనియా గాంధీ పేర్కొన్నారు. 
సోనియా గాంధీ , రాహుల్ గాంధీలు విదేశాలకు పారిపోకుండా , వాళ్ళ పాస్ పోర్ట్ ని జప్తు చెయ్యాలి , వారికి కోర్టు దేశం విడిచి వేల్లరాడు అని డా సుబ్రహ్మణ్యం స్వామి  కోర్టు వారిని కోరినప్పుడు పటియాల కోర్టు కాంగ్రెస్ కు  కాని, సోనియా , రాహుల్ గాంధీ లకు చరిత్ర ఉంది వాళ్ళు దేశం విడిచి పారిపోతారు అనుకోవటం లేదు అంటూ కోర్టు పేర్కొనటం విశేషం.  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి