15, జులై 2012, ఆదివారం

" తెలంగాణా - ఈజిప్ట్ " ఉద్యమం !

ఈ మద్య ఒక్క మేధావి ఈజిప్ట్ తరహ ఉద్యమం చేద్దాం అంటున్నాడు , అవసరం అయితే అక్కడికి నాయకులను పంపి అద్యయనం చేద్దాం అంటున్నాడు . ఈజిప్ట్ ఉద్యమం దశబ్దాలుగా నియంత పరిపాలనలో ఉండి, ఉక్కుపాదాల కింద నలిగి అణిగి ,అణిగి ఉండి ఒక్కసారిగా అణు బాంబుల విస్పోటనం చెంది ప్రజాస్వామ్య పరిపాలనకోసం జరిగిన ఒక్క మహత్తర సంఘటన . కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లో కొంతమంది రాజకీయ భూస్వాములు తమ రాజకీయ ప్రాదాన్యత కోసం ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆ బడుగు శవాల  పునాదుల మీద  వీళ్ళ రాజకీయ మేడలు నిర్మించుకొంటున్నారు.

తెలంగాణా ఉద్యమం ఒక్క ప్రజాస్వామ్య కోసం  అని ఎలా చెప్పగలరు ? లేదా అత్మాభిమాన పోరాటం అని ఎలా చెప్పగలరు ? ఒక్క రాష్ట్ర విభజనతో ఆ ప్రాంత సామన్య ప్రజల జీవన స్తితిగతులు ఎలా మారగలవు? ఇదే ప్రజాస్వామ్య దేశం లో, ఇదే ప్రాంతం లో  తర తరాలుగా బానిస బ్రతుకు బతికిన గిరిజన , దళిత , వెనకబడిన వర్గాల ప్రజల సామజిక , ఆర్దిక ,రాజకీయ భవిషత్ ను రాష్ట్ర విభజనతో మార్చగలరా ? ఇదే దొరల ఫ్యూడల్  పెత్తనాన్ని ఎదిరించి చివరకు తుపాకీ పట్టి తమ ఆత్మగౌరవం కోసం పోరాడితే తీవ్రవాది అని తినే అన్నంలో విషం పెట్టి ఎన్కౌంటర్ పేరుతొ కాల్చి చంపుతున్నారే . ఇప్పడు ఈ దొరలూ చేస్తున్న ఉద్యమం ఆయా వర్గాల స్తితిగతులు మర్చగలదా అంటే సందేహమే ! అప్పుడు లేని ఆత్మ గౌరవం , ఇప్పుడు ఎలా ఉంది?

ప్రపంచీకరణ , గ్లోబలీకరణ సమాజం లో ఒక్క రాష్ట్రము విడిపోతే అక్కడి స్తితిగతులు మారతాయ అనేది అక్షరాల అసత్యం . పెట్టుబడుదారులు, జాతి ,ప్రాంతం ,దేశం అనే తేడా లేకుండా దేశ ప్రజల లేదా ఆ ప్రాంత ప్రజల సహజ సంపదని  దోచుకుంటుంటే ఒక్క మాట అన ని ఈ మేధావులు , రాజకీయ వాదులు రేపు తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటో ప్రజలు అడగాలి . బడుగు వర్గాల తల్లులు తమ బిడ్డలను బలిదానాలకు పంపేటప్పుడు ఉద్యమం నాయుకులను నిలదీయాలి .

పోరాటాలలో , ఉద్యమాలలో ప్రజల పాత్రలేకుండా రాజకీయ పార్టి ల కార్యకర్తలతో ఉద్యమం చేస్తే అది ఖచితంగా రాజకీయ పోరాటమే . అది ఈజిప్ట్ తరహా ఉద్యమం అయిన సాయుధ పోరాటం అయిన ప్రజలకు నమ్మకం కలగాలి , నాయకత్వం ఆ దిశగా వెళ్ళాలి .ఓట్ల గెలుపుతో అది ప్రజల మద్దత్తు అనుకోవటం పొరపాటు అవుతుంది. ఎప్పుడు అయితే ప్రజలు ఉద్యమం లోకి  వస్తారో అప్పుడు ఏ పాలకులు , ప్రభుత్వం అయిన దిగిరావలిసిందే. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం . అప్పుడు ప్రజల కోరిక " ప్రత్యెక తెలంగాణా " రాష్ట్రము ఏర్పడుతుంది . అప్పటి వరకూ అది రాజకీయ ఆదిపత్య పోరాటమే . ఈజిప్ట్ తరహ ఉద్యమం ఆయినా , విప్లవం అయిన ఓట్ల ,సీట్లు కోసమే అవుతుంది .

7 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది వెంకట్...బాగా ఆలోచింపజేసేదిగా ఉంది

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారండి!! తెలంగాణ ఉద్యమాన్ని ఈజిప్ట్ ప్రజాస్వామిక ఉద్యమంతో పోల్చడం ముమ్మాటికీ తప్పు!! ఈజిప్టులో సాగిన ఉద్యమం దశాబ్దాల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, పాలన ప్రజల చేతుల్లోనే ఉండాలన్న ప్రజాస్వామిక కాంక్షతో, ప్రజాస్వామ్యస్థాపన అన్న లక్ష్యంతో సాగిన ఉద్యమం.

    తెలంగాణలో ఇప్పటికే ప్రజాస్వామ్య పాలన ఉన్నది, కొత్తగా వచ్చే ప్రజాస్వామ్యం ఏమీ లేదు. "ఒకే భాష" పేరిట దశాబ్దాలుగా సాగిన సాంస్కృతిక అణచివేతకూ, వలసవాద దోపిడీ విధానాలకూ వ్యతిరేకంగా, ఎక్కడి వనరులు అక్కడి ప్రజలకే దక్కాలన్న మౌలిక లక్ష్యంతో సాగుతున్న ఉద్యమం తెలంగాణది. ఈజిప్ట్ ఉద్యమ లక్ష్యాలకూ, తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమ లక్ష్యాలకూ పొంతనే లేదు. ఈ రెండు ఉద్యమాల లక్ష్యాలను పోల్చలేము!!

    కాకపోతే, "ఈజిప్ట్ తరహా ఉద్యమం చేద్దాం" అన్న తెలంగాణ జేఏసీ నాయకుల మాటలను మీరు పొరపాటుగా అర్ధం చేసుకున్నారు. ఆ మాటలకు అర్థం - ఈజిప్ట్ ఉద్యమకారుల పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, వారు ఎంచుకున్న ఎత్తుగడలనూ, ఉద్యమరూపాలనూ అధ్యయనం చేసి, వాటిని తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర సాధన కొరకు అమలుచెయ్యటం" అని!! మీరనుకున్నట్టు "తెలంగాణలో ప్రజాస్వామ్య స్థాపన కొరకు పోరాడదాం!!" అని కానే కాదు. తెలంగాణలో ఇప్పటికే ప్రజాస్వామ్య పాలన ఉన్నది, కొత్తగా తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమకారులు తెచ్చే ప్రజాస్వామ్యం ఏమీ లేదు.

    ఈజిప్ట్ ఉద్యమస్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ "లక్ష్యాన్ని" మార్చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఈజిప్ట్ ఉద్యమ పోరాటరూపాలనూ, ఎత్తుగడలనూ తెలంగాణ పరిస్తితులకు అనుగుణంగా మలచుకుని ప్రభుత్వం మెడలు వంచడానికి అమలుచెయ్యాలని తెలంగాణ జేఏసీ ఆలోచన!!

    రిప్లయితొలగించండి
  3. తెలంగాణ ఉద్యమం "ప్రజాస్వామ్యం" కోసం కాదు, సొంత వనరులపై కోస్తాంధ్ర ఆధిపత్యకులాల, వర్గాల పెత్తనాన్ని బద్దలుగొట్టి, తమ వనరులను తమ ప్రాంతానికి వాడుకోవడం కోసం!!

    తెలంగాణ సాంస్కృతిక అణచివేతకు గురవ్వడం వల్ల, తెలంగాణ భాష రెండో శ్రేణి భాష, తెలంగాణ ఆచారవ్యవహారాలు, పండుగలు రెండో శ్రేణివి అన్న అవహేళనకు గురవుతుండడం వల్లా తెలంగాణ ప్రజల్లో తమ సంస్కృతి వైవిధ్యాన్ని కాపాడుకోవాలన్న స్పృహ పెరిగింది. ఆ కారణంగా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమానికి "ఆత్మాభిమానం కోసం" అన్న కోణం కూడా జత కలిసింది. తెలంగాణ ఉద్యమం కేవలం ఆత్మాభిమానం కోసమే సాగుతున్న ఉద్యమం కాదు, ఉద్యమంలో అదొక కోణం మాత్రమే!!

    రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంత సమస్యలన్నీ తీరిపోవు. ఒక్కసారిగా జపాన్, చైనాలను తలదన్నే సంపద సృష్టించబడదు. కాకపోతే తెలంగాణకు తన సమస్యలు తానే పరిష్కరించుకోగల రాజకీయ అధికారం వస్తుంది. సమైక్యరాష్ట్రంలో దశాబ్దాలుగా తీరని సమస్యలైన నల్లగొండ ఫ్లోరైడ్, శ్రీరాంసాగర్ నిర్మాణం పూర్తి, గొలుసుకట్టు చెరువుల సంరక్షణ-పునర్నిర్మాణం మొదలైన వాటి పరిష్కారానికి నిర్ణయం తీసుకోగల స్వయంనిర్ణాయకశక్తి మాత్రం కలుగుతుంది. తెలంగాణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు మొదలు మాత్రమే!! అందుకే "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలన్నీ తీరిపోతాయి" అని తెలంగాణ నాయకులైనా, ప్రజలైనా భావిస్తే అది తప్పే!!

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత కూడా దొరల ఫ్యూడల్ పెత్తనాన్ని ఎదిరించడం, రాజ్యాధికారాన్ని బడుగుల చేతిలోకి తీసుకోవడం, అందుకు సమరశీల పోరాటాలు చెయ్యడం లాంటి పనులు మిగిలే ఉంటాయి.

    దురదృష్టకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వ స్థానంలో ఉన్న తెరాస/కేసీఆర్ ఎజెండాలో "బడుగులకే రాజ్యాధికారం" అన్న point లేదు. కానీ కోదండరామ్ నేతృత్వంలోని రాజకీయ జేఏసీ, గద్దర్ ఫ్రంట్, విమలక్క ఫ్రంట్, ప్రజాసంఘాల జేఏసీలు ఈ అంశం పట్ల స్పష్టతతో ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుతో తెరాస పని పూర్తి అయితే, ప్రజాసంఘాల పని అప్పుడే మొదలవుతుంది.

    బడుగులకు అధికారం దక్కినప్పుడే, కులాల అంతరాలు మటుమాయం అయిపోయినప్పుడే, భూమి, నీరు వంటి ఉత్పత్తిసాధనాలపై అందరికీ హక్కులు కలిగినప్పుడే నిజమైన ఆత్మగౌరవం సాధించినట్టు, నిజమైన ప్రజాస్వామ్యం స్థాపించినట్టు!!

    రిప్లయితొలగించండి
  4. దశాబ్దాల తరబడి విడతవారీగా సాగుతున్న కారణంగా తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి లోతుగా చొచ్చుకుపోయినప్పటికీ ఉద్యమ నాయకత్వ స్థానాలు ఫ్యూడల్ బూర్జువా వర్గాల చేతుల్లోనే ఉన్నాయి.

    ఏ ఉద్యమం నడిసినా వాటి నాయకత్వస్థానాన్ని అందుకోవడం, ప్రజలను మభ్యపెట్టి ఉద్యమ ఫలాలను కాజేయడం, స్వచ్చమైన ప్రజాఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం చేసే తుచ్చ రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. దీనికి మర్రి చెన్నారెడ్డిని మించిన ఉదాహరణ ఉండకపోవొచ్చు. కమ్యూనిస్ట్ ఉద్యమం రాష్ట్రంలో బలంగా ఉన్నప్పుడు, అందులో పాల్గొని, ఉద్యమనేపథ్యంతో ఎదిగి, ఆ తరవాత రియల్ ఎస్టేట్ settlements చేసిన నాయకులు మనకు సుపరిచితమే!!

    మీడియా, సర్కారు మద్దతూ, అంగబలమూ, అర్థబలమూ పుష్కలంగా ఉన్న బలమైన కోస్తాంధ్ర పాలక వర్గాలను ఎదిరించి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే, తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల నాయకులకు ప్రజాబలం ఒక్కటే సరిపోదు. అంగబలమూ, అర్థబలమూ కూడా కావాలి. ఆ కారణంగా తెలంగాణ ఫ్యూడల్ వర్గాల సాయం తీసుకోక తప్పని పరిస్తితులు ప్రస్తుతం ఉన్నాయి.

    రష్యన్ విప్లవం తరవాతా, చైనా విప్లవం తరవాతా కొన్నాళ్లు సివిల్ వార్ నడిసినట్టు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత మెజారిటీలైన శ్రామికవర్గ బడుగులకూ, మైనారిటీలైన పాలకవర్గ దొరలకూ వార్ తప్పదు!! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యల పరిష్కారానికి అంతం కాదు, ఆరంభమే!!

    రిప్లయితొలగించండి
  5. @shamili, Chak, Thank you very much. And Avinash Vellampally thanks for your comment& Analysis

    రిప్లయితొలగించండి
  6. ఆన్న మంచి వ్యాసం రాసారు తెలంగాణా గుర్చి......

    కాని మేము ఎందుకు తెలంగాణా గుర్చి పొరాడుతున్నాం మీకు తేలియనిది కాదూ!

    మా పొరాటం ఒక ఆత్మాభిమనం కొసం మాత్రమే కాదు.

    తరతరా లుగ దొపిడి కి గురవుతున్న మా తెలంగాణా సహజ వనరుల కొసం
    తలాపున పారుతూన్నా వాడుకొలెని గొదావరి నీల్ల కొసం
    సమైక్యా రాష్ట్రం లొ, నీటిని తాగడానికి కొసం కాకుండా సాగు కొసం తరలివెల్లించుకుపొతున్న
    ఏమి అనలెని నా తెలంగాణా అమాయకా ప్రజల కొసం.
    దశాబ్దాలుగా ఫ్లొరొసిస్ వ్యాధి తొ బాదాపడుతున్న నా నల్లగొండ జిల్లా వాసులా కొసం
    నా తెలంగాణా బొగ్గు ని జాతికి అకితం చెసి పగలె చీకటి లా బతుకులిడుస్తున్నా నా అమాయకా తెలంగాణా పౌరుల కొసం
    పునాది రాల్ల కె పరిమితమైన నా తెలంగాణా ప్రాజెక్ట్ ల కొసం

    ఏన్ని నిందలు వేసిన, ఎన్ని ఇబందులు వచ్చిన మా ఈ పొరటం అగదు తెలంగాణా వచ్చె వరకు........

    రిప్లయితొలగించండి