14, డిసెంబర్ 2012, శుక్రవారం

దున్నేవాడిదే భూమి


" దున్నే వాడిదే భూమి " ఒక్కప్పుడు ఈ నినాదం వాడ ,వాడల మార్మోగింది , లక్షలాది మంది ప్రజలు ప్రభావితం అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రదాన ఆదాయ వనరు అయిన " భూమి " . ఎలాంటి కుల వృత్తి లేనటువంటి ప్రజలకు భూమి ఒక్క ఆయువుపట్టు . సామాజికంగా , ఆర్ధికంగా వెనకబడిన వర్గాలను వివక్ష నుండి రక్షించాలి అంటే భూమి కావలి .

దశబ్దాలు గడిచేకొద్దీ మనువాదులు ఈ దేశాన్ని , సమాజాన్ని కులం వర్గాల వారిగా విడదీసినప్పుడు అనాదిగా భూమినే నమ్ముకున్న ' ఈ దేశపు ములవాసులు ' భూమి నుండి దూరంగా నేట్టవేయబడ్డారు . భూమి లేని ప్రజలు బానిసలుగా , కూలీలుగా మార్పు చెందేరు . " పోరాడితే పోయేది ఏముంది - బానిస సంకెళ్ళు తప్పా "  ఈ నినాదం వాళ్ళ ఊపిరి అయ్యింది . అవును బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందటానికి ఇంటికొక మనిషి గుట్టల్లో , చెట్టులో తమ ప్రాణాన్ని పెట్టి పోరాడరు . భరత మాత తమ పిల్లల కోసం తనే రాసుకున్న రాజ్యాంగాన్ని కాదు అని బానిసలుగా , వెట్టి చాకిరి చేయిస్తున్న పెట్టందారులను ఎదుర్కోవటానికి ఒక్కొకరు ఒక్క " సూర్యుడి " లా భగ ,భగ మండేరు.

కాలం మారింది , ప్రజల తిరుగుబాటు కు ప్రభుత్వాలు కదిలేయి , మీకోసం భూమి పంచుతాం అన్నారు , అడవి , గుట్ట , నీరు మీదే అన్నారు . రాళ్ళూ ,రప్పలు , తప్ప నీరులేని భూమి ఇచ్చేరు అయిన సరే తమ రక్తాన్నే నీరుగా పోసి బంగారాన్ని పండించేరు . బానిస - బంగారాన్ని పండించేడు . పెద్దోడి కన్ను బగారం మీద - కాదు బంగారం లాంటి భూమి మీద పడింది 

భరత మాత ' మాట తప్పింది ' ! మీ కోసం ఈ  భూమి అన్న నోరు ఇప్పుడు అదే నోటి తో అబద్దం ఆడుతుంది. మీకోసం అభివృద్ధి అంటూ అదే గుట్టలను , భూమిని భలవంతాన లాక్కుంటుంది. బ్రతిమిలాడి , దండం పెడితే తుపాకి ఎక్కుపెట్టింది. తిరగబడితే యుద్ధం ప్రకటించింది . బారతమాత తన బిడ్డలు మీద " యుద్ధం " ప్రకటించింది. 

66 సంత్సరాల స్వాత్రంత  బారత దేశం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. భూమి అడిగిన పాపానికి యుద్ధం ప్రకటించింది. ఇన్ని సంత్సరాలు పాలకులు చూపిన అభివృద్ధి నీటి రాతలే . నేటికి కిలో బియ్యం కొనలేని స్తితిలో ఇదే పాలకులు ప్రజలను బిచ్చగాళ్ళుగా తమ దుకాణాల మీద నుంచో పెట్టింది . ఎవరికోసం ఈ కిలో " రూపాయి " బిక్ష . భూమి , నీరు మీరు తీసుకుని మాకు బిక్ష ఇస్తారా ! అని అడిగే శక్తి లేని ప్రజలను ఓట్ల రాజకీయాల కోసం బిక్షగాళ్ళను చేస్తుంది .అభివృద్దిని అరచేతిలో చూపించి , ఇంకొక చేతితో పీకలు నోక్కేస్తుంది.

ప్రజా ప్రభుత్వాలు భందు ప్రీతి , అవినీతి ఊబిలో పీకల్లోతుల్లో మునిగి సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణ , గ్లోబలైజేషన్ లో ప్రజలను వలస వాదులు గా చేస్తున్నాయి . పెట్టుబడి దారుల గుప్పెట్లో ప్రజా ప్రభుత్వాలు అత్యంత క్రూరంగా ప్రజలను భూమి నుండి దూరం చేస్తున్నాయి. ఆర్ధిక అవసరాల కోసం ప్రపంచ దేశాలు ఒక్కటి అవుతున్నాయి , కానీ ఆ దేశం లోని ప్రజలను విడదీస్తున్నాయి . తర తరాలుగా వెనకబడి అభివృద్ధి కోసం , తమ స్తితి గతుల్లో మార్పు కోసం ఒక వర్గం గా , అభివృద్ధి పేరుతొ ప్రజలను దోచుకున్న ఇంకొక వర్గం ఇంకొక వైపు !
అందుకే " దున్నేవాడిదే భూమి " కావలి , ఇంకొక్క సారి మారుమోగాలి 

అదిగో వస్తున్నాయి , వస్తున్నాయి 
జగన్నాధ రధచక్రాలు ...,
వద్దు ,ఇంకా ఆశపడకండి .

ఈ భూమి , నీరు మనదే. పోరాడండి , పోరాడితే పోయేది బానిస సంకెళ్ళు .

5 కామెంట్‌లు:

  1. అద్భుతంగా రాశారు వెంకట్ గారూ!! మీ వ్యాసాల్లో ఇది కచ్చితంగా ఒక masterpeice!!

    మనువాదానికి ఇప్పుడు పెట్టుబడిదారీ పద్ధతీ, ఆశ్రిత పక్షపాతమూ జత కలిశాయి. జనజీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. డబ్బు, స్వార్థం మాత్రమే నేడు ప్రభుత్వపాలనను నిర్దేశిస్తున్నాయి. ప్రజాసంక్షేమం నేడు ఒక బూతు మాట!!

    ప్రజల ఉమ్మడి సొత్తు అయిన ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీలకూ, ప్రైవేట్ వ్యక్తులకూ కట్టబెట్టడం కోసం రాజకీయ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వాల మనుగడను పణంగా పెట్టి మరీ ప్రైవేట్ ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు. దానికి అభివృద్ధి అని కలరింగ్ ఇస్తున్నారు.

    భారత ప్రభుత్వం ప్రజల తిరుగుబాట్లకు ఏనాడూ సరైన విధంగా స్పందించలేదు. కమ్యూనిస్టుల భూపోరాటాలకూ, నక్సలిజం ఉద్ధృతికీ అడ్డుకట్ట వెయ్యడానికి భారతప్రభుత్వం తాత్కాలికంగా చెప్పిన కల్లబొల్లి కబుర్లు భూసంస్కరణలు!! ఏదో చేసేస్తున్నట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే అది!! బెంగాల్, కేరళ, త్రిపుర తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వమూ ఇప్పటికీ ఇన్నేళ్లయినా భూసంస్కరణలపై దృష్టి పెట్టలేదు. భారతప్రభుత్వం చెప్పిన భూసంస్కరణలు వంద శాతం డ్రామా!!

    ప్రజల ఉమ్మడి వనరులనూ, వ్యక్తిగత ఆస్తులనూ కాపాడాల్సిన బాధ్యత గా భారత ప్రభుత్వం, తానే వాటిని కబ్జా చెయ్యడం మొదలుపెట్టింది. సహజ వనరులనూ, వ్యక్తిగత భూములనూ రాజకీయ నాయకుల రూపంలో ఉన్న వ్యాపారులకూ, వ్యాపారుల రూపం లో ఉన్న రాజకీయ నాయకులకూ రాసిచ్చేస్తున్నది. ప్రజలకు తిరగబడడం తప్ప వేరే దారి మిగలలేదు.

    చిన్న చిన్న ప్రతిఘటనల స్థాయి నుంచి మొదలైన తిరుగుబాటు, మావోయిజం ప్రవేశంతో తిరుగుబాట్లు సిద్ధాంతభూమికను సంపాదించుకుని, వ్యవస్తీకృతమై, మరింత బలపడి నేడు రాజ్యాన్ని ధిక్కరించే స్థాయికి ఎదుగుతున్నది. దోపిడీ కొనసాగించడం కోసం భారత ప్రభుత్వం పోరాడుతున్న సొంత ప్రజలపై యుద్ధం ప్రకటించింది. భారత ప్రభుత్వానికి ప్రజలు కాదు, కంపెనీలు ముఖ్యం!! ప్రజాసంక్షేమం కాదు, వ్యాపారప్రయోజనాలు ముఖ్యం!!

    భారతప్రభుత్వం ప్రజాప్రభుత్వం కానే కాదు. మన వ్యవస్థ ప్రజాస్వామ్యం అసలే కాదు. అలా కలరింగ్ ఇస్తున్న పక్కా వ్యాపారస్వామ్యం మనది. రాజకీయమూ, వ్యాపారమూ ఈరోజు వేరువేరు కావు.

    ఈ వ్యాపారస్వామ్యం అంతం కావాలన్నా, నిజమైన ప్రజాపాలన రావాలన్నా, ప్రజల ఉమ్మడి వనరులకూ వ్యక్తిగత ఆస్తులకూ భద్రత కావాలన్నా "జనతన సర్కారే" శరణ్యం!! అందుకే, మరొక్కసారి "దున్నేవాడిదే భూమి" అన్న నినాదం ఊరూవాడా మారుమోగాలి. ప్రజల తిరుగుబాటు డిల్లీ సర్కారును కూలదోయాలి!!

    రిప్లయితొలగించండి
  2. ముందుగా , ధన్యవాదాలు అవినాష్ , మీ ప్రతిస్పందన అద్బుతం , ప్రబుత్వాల దళారీవిధనాన్ని ప్రజలు ప్రస్నించక పొతే ముందు ముందు చాల ప్రమాదం .

    రిప్లయితొలగించండి
  3. Land is at the core of the culture.
    Without land no farmer survives.....
    Revolutions will occur, if the land is taken autocratically!

    రిప్లయితొలగించండి
  4. Thank you Dynamic youth for your words, what your are written is true.

    రిప్లయితొలగించండి
  5. Nijam ga bagundi venkat...idi oka vyasam ga kaka prati okkari gunde lo chappudu ayite enta bagundu?

    రిప్లయితొలగించండి