15, జులై 2012, ఆదివారం

" తెలంగాణా - ఈజిప్ట్ " ఉద్యమం !

ఈ మద్య ఒక్క మేధావి ఈజిప్ట్ తరహ ఉద్యమం చేద్దాం అంటున్నాడు , అవసరం అయితే అక్కడికి నాయకులను పంపి అద్యయనం చేద్దాం అంటున్నాడు . ఈజిప్ట్ ఉద్యమం దశబ్దాలుగా నియంత పరిపాలనలో ఉండి, ఉక్కుపాదాల కింద నలిగి అణిగి ,అణిగి ఉండి ఒక్కసారిగా అణు బాంబుల విస్పోటనం చెంది ప్రజాస్వామ్య పరిపాలనకోసం జరిగిన ఒక్క మహత్తర సంఘటన . కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లో కొంతమంది రాజకీయ భూస్వాములు తమ రాజకీయ ప్రాదాన్యత కోసం ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆ బడుగు శవాల  పునాదుల మీద  వీళ్ళ రాజకీయ మేడలు నిర్మించుకొంటున్నారు.

తెలంగాణా ఉద్యమం ఒక్క ప్రజాస్వామ్య కోసం  అని ఎలా చెప్పగలరు ? లేదా అత్మాభిమాన పోరాటం అని ఎలా చెప్పగలరు ? ఒక్క రాష్ట్ర విభజనతో ఆ ప్రాంత సామన్య ప్రజల జీవన స్తితిగతులు ఎలా మారగలవు? ఇదే ప్రజాస్వామ్య దేశం లో, ఇదే ప్రాంతం లో  తర తరాలుగా బానిస బ్రతుకు బతికిన గిరిజన , దళిత , వెనకబడిన వర్గాల ప్రజల సామజిక , ఆర్దిక ,రాజకీయ భవిషత్ ను రాష్ట్ర విభజనతో మార్చగలరా ? ఇదే దొరల ఫ్యూడల్  పెత్తనాన్ని ఎదిరించి చివరకు తుపాకీ పట్టి తమ ఆత్మగౌరవం కోసం పోరాడితే తీవ్రవాది అని తినే అన్నంలో విషం పెట్టి ఎన్కౌంటర్ పేరుతొ కాల్చి చంపుతున్నారే . ఇప్పడు ఈ దొరలూ చేస్తున్న ఉద్యమం ఆయా వర్గాల స్తితిగతులు మర్చగలదా అంటే సందేహమే ! అప్పుడు లేని ఆత్మ గౌరవం , ఇప్పుడు ఎలా ఉంది?

ప్రపంచీకరణ , గ్లోబలీకరణ సమాజం లో ఒక్క రాష్ట్రము విడిపోతే అక్కడి స్తితిగతులు మారతాయ అనేది అక్షరాల అసత్యం . పెట్టుబడుదారులు, జాతి ,ప్రాంతం ,దేశం అనే తేడా లేకుండా దేశ ప్రజల లేదా ఆ ప్రాంత ప్రజల సహజ సంపదని  దోచుకుంటుంటే ఒక్క మాట అన ని ఈ మేధావులు , రాజకీయ వాదులు రేపు తెలంగాణా ప్రత్యెక రాష్ట్రంగా ఏర్పడితే సామాన్య ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటో ప్రజలు అడగాలి . బడుగు వర్గాల తల్లులు తమ బిడ్డలను బలిదానాలకు పంపేటప్పుడు ఉద్యమం నాయుకులను నిలదీయాలి .

పోరాటాలలో , ఉద్యమాలలో ప్రజల పాత్రలేకుండా రాజకీయ పార్టి ల కార్యకర్తలతో ఉద్యమం చేస్తే అది ఖచితంగా రాజకీయ పోరాటమే . అది ఈజిప్ట్ తరహా ఉద్యమం అయిన సాయుధ పోరాటం అయిన ప్రజలకు నమ్మకం కలగాలి , నాయకత్వం ఆ దిశగా వెళ్ళాలి .ఓట్ల గెలుపుతో అది ప్రజల మద్దత్తు అనుకోవటం పొరపాటు అవుతుంది. ఎప్పుడు అయితే ప్రజలు ఉద్యమం లోకి  వస్తారో అప్పుడు ఏ పాలకులు , ప్రభుత్వం అయిన దిగిరావలిసిందే. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం . అప్పుడు ప్రజల కోరిక " ప్రత్యెక తెలంగాణా " రాష్ట్రము ఏర్పడుతుంది . అప్పటి వరకూ అది రాజకీయ ఆదిపత్య పోరాటమే . ఈజిప్ట్ తరహ ఉద్యమం ఆయినా , విప్లవం అయిన ఓట్ల ,సీట్లు కోసమే అవుతుంది .

11, జులై 2012, బుధవారం

ఓట్ల " విభజన "

ఆంద్ర ప్రదేశ్ ఎలా ఆవిర్భవించిందో మన అందరికీ బాగా తెలుసు దానిగురించి మనం చర్చించుకోవటం పెద్దగా అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ మనం ఒక్కవిషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం  ఇంకొక కారణం. ప్రస్తుతం మన రాష్ట్రము లో గత 12 యేండ్లనుండి రాష్ట్రాన్ని రెండుగా చెయ్యాలి అని ఒక్క ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు పోరాటం చేస్తున్నారు .రాష్ట్రాన్ని విడతీయాలి , లేదు సమైక్యంగా ఉంచాలి అనేది పక్కన పెడితే ఈ విభజన వలన ఏ రాజకీయ పార్టికి ఎక్కువ ఓట్లు వస్తాయి , ఏ పార్టి అధికారం లోకి వస్తుంది అనేది ప్రదానమైన సమస్య . ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను కాకుండా రాజకీయ పార్టీల భవిషత్ గురించి చర్చించుకోవటం విడ్డురం . కాంగ్రెస్ కి లాభమా , తే రా స కి లాభమా అని చర్చలు జరపటం బాధాకరం .వై ఎస్ ర్ కాంగ్రెస్ పార్టి గెలుపు ఆపాలి అంటే రాష్ట్ర విభజన చెయ్యాలి ,ఆ పార్టీని ఆవిధంగా అడ్డుకోవాలి అని కుడా చర్చలు జరుగుతున్నాయి 


2014 లో రాహుల్ గాంధీ ప్రదాని కావాలి అంటే తెలంగాణా ని విభాజించాలా? తే ర స  ని కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని రాష్ట్రాన్ని విభజిస్తే మెజారిటి MP స్తానాలు కాంగ్రీస్ వి అప్పుడు రాహుల్ గాంధీ ప్రదాని కావటానికి మెజారిటి స్తానాలు కాంగ్రెస్ కి సరిపోతాయి అనే తప్పా అసలకి ఒక్క రాష్ట్రాన్ని ఏ సిద్దాంతం మీద విభజించాలి , రాష్ట్రాల ప్రయోజనాలు ,ఆయా ప్రాంతాల ప్రజల అవసరం ఏమిటి ,దేశ సమగ్రత ,దేశం లో జరిగే పరిణామాలు ఏంటి అనేవి పాలకులు కాని ,మిగత రాజకీయ పార్టిలు కానీ ఆలోచించటం లేదు , వాళ్ళ రాజకీయ భవిషత్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు .


మన రాష్ట్రము లో రెండో అతిపెద్ద విభజన సమస్య SC వర్గీకరణ ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు దేశం మొత్తానికి సంబందినిచినది అసలకు ఇది రాష్ట్రాలతో సంబంధం లేని సమస్య కానీ రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం ఇలాంటి విభజనలు మన ముందుకు తీసుకు వస్తున్నారు . ఈ మద్య ఒక్క పార్టి విస్త్రుతస్తాయి సమావేశం లో 2014 లో ఆ పార్టి గెలుపుకోసం దీనిని కూడా తమ ఎజండా లో ప్రదాన పదకం గా పెట్టుకున్నారు . 



రాజకీయ పార్టిలు వాళ్ళ అవసరాలకోసం , ఓట్లకోసం ,సీట్ల కోసం ఇలాగ మనుషులు మద్య ,ప్రాంతాల మద్య ,కులాల మద్య విభజన రేఖ గీస్తున్నారు . ఎప్పుడో బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన విభజించు పాలించు అనే రాజనీతి సూత్రాన్ని ఇప్పుడు మనవాళ్ళు , మన ప్రజల మీద ప్రయోగిస్తున్నారు . ఇంకొక ఆచర్యకరమైన విషయం ఏంటంటే అన్ని పార్టీలలో రెండు గ్రూపులు ఒకరు వెతిరేకిస్తారు ,ఇంకొకరు సమర్దిస్తారు ఆ పార్టి అధినాయకత్వం ఏమి అనదు. అంటే పార్టీల , వ్యక్తుల స్వలాభం కోసమే ఈ విభజన?  వీళ్ళకు మేధావి అనే ఇంకొక వర్గం వత్తాసు పలుకుతూ ఉంటుంది . 



ప్రభుత్వాలు ఓట్ల కోసం కాకుండా ప్రజల , దేశ అవసరాలకోసం , ప్రజల జీవిత ప్రమానాలకోసం రాష్ట్రాలను కానీ ,ప్రజలను కానీ విభజిస్తే మంచిదే , ఆ పేరుతొ ప్రాంతాలతో , ప్రజలతో ,తమ తమ వ్యక్తిగత ,రాజకీయ అవసరాలకోసం విభజిస్తే సమాజం ఒప్పుకోదు...చరిత్రలో స్తానం ఉండదు .






3, జులై 2012, మంగళవారం

హిందూ మతం ప్రమాదం లో ఉందా !


ఈ మద్య మీడియా లో ఈ రకమైన చర్చ చూస్తున్నాం , ఎవరు అయితే హిందూ ధర్మానికి ( మతం ) పెద్దలగా ఉన్నారో, అలాగే స్కాలర్స్ , స్వామీజీ లు ,పూజారులు ఇంకా మతానికి సంబందించిన పెద్దలు హిందూ మతానికి లేదా ధర్మానికి ఈ దేశం లో ప్రజలు దూరము అవుతున్నారు , అన్యమతనికి ఆకర్షింప బడుతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు . అసలకి హిందూ మతం నుండి ఎందుకు ఇతర మతం లోకి వెళ్ళుతున్నారు అని ఎవరు ప్రశ్నించటం లేదు . మనలో లోపం ఏంటి ,ఎందుకీ దుస్తితి అని ఏ మత పెద్ద కాని ,స్వామిజి లు కాని ప్రశ్నించటం లేదు . గొడ్డును (బీఫ్ ) ని చంపితేనే హాహాకారాలు చేస్తున్న ఈ పెద్ద మనుషులు , సాటి మనిషిని ఎందుకు గౌరవించటం లేదు .మీ అందరకి ప్రత్యేకమైన గోత్ర నామాలు ఉన్నప్పుడు ఇతర కులాల వారికీ ముక్యంగా దళితులను ఎందుకు గౌరవించటం లేదు . పశువు కంటే హీనమా ?. ఆలోచించండి మత పెద్దలారా . తర తరాలుగా హిందూ మతం / ధర్మాన్ని ఆచరిస్తున్న దళితులు , గిరిజనులు ఇంకా గ్రామాలలో ఉన్నారు .మీ అవివేకం తో వారినికూడా దూరం చేసుకోవద్దు . ఎవరు ఈ రోజులలో డబ్బుకోసం . పాలు, రొట్టె కోసం మతం మారుతున్నారు అంటే అది మీ బ్రమే. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడు ఖచితంగా వేరే మార్గం ఆలోచిస్తారు .

ఇంకొక ప్రధాన వాదన ఈ గ్రూపు సబ్యులు మిగత వాళ్ళ మాటలకూ ప్రేరణ కలిగిన ప్రజలు ముస్లిం , క్రిస్టియన్ మతాన్ని ఈ విధంగా దుశిస్తారా లేక వెతిరేకంగా ప్రచారం చేయగలరా అంటున్నారు . ఈ దేశం లో ఈ రెండు మతాలూ ,సిక్కు  మతాలు మైనారిటీ అంటే తక్కువ ప్రజలు ఉన్న మతాలు . ఈ మతాలూ ఏవీ వివక్ష పాటించదు. ఇక్కడ కుల గోత్రాలు ఉండవు. అందరు సమానమే .ఆ మద్య ఆంధ్రజ్యోతి TV ఛానల్ BIG DEBATE ఎడిటర్ రాధా క్రిష్ణ గారు చివరిగా అడిగిన ప్రస్నా " మీరు ఈ అంటారని తనాని వదులుకుంటారా అంటే ఎవరు సరియిన సమాదానం చెప్పలేక పోయారు . చివరికి అయిన మీ ఖర్మ అంటూ ఆ debate ని ముగించేడు . అందులో పాల్గొన్న మన రాష్ట్ర మాజీ పోలీసు బాస్ కుడా ఒక్క వాక్య చేసేడు ,నాలాంటి వారికీ కుడా స్వామిజి ని తాకే అర్హత లేనప్పుడు ఇంకా సామన్య మనిషికి మీరు ఏవిధంగా దగ్గర అవుతారు అనేదానికి సమాదానం లేదు. అయితే ఇక్కడ మన మత పెద్దలు ఒక్క తెలివైన వాదనని ముందుకు తీసుకు వస్తున్నారు . వేదాలలో ఈ అంటరానితనం లేదు వ్యాసుడు దగ్గరనుండి రాముడు శబరి ఎంగిలి తినేవరకు చెబుతారు .ఇంకొంచం ముందుకు వెల్లి ఆది గురువు శంకరాచార్యులు జ్ఞానోపదేశం గురించి చెబుతారు .నిజమే అవి అన్ని అక్షరాల సత్యమే కాని, మరి వారి శిష్యులు వారి బోదనలు ప్రచారం చేసే ఈ నాటి సమాజానికి ఏమైంది . ఎందుకు ముషులను వేరుగా చూస్తున్నారు .వర్ణాలు , వర్గాలు గా ఎందుకు సమాజాన్ని ఎందుకు విడగొట్టేరు ? ఈ ప్రశ్నలకి ఎక్కడ సమాదానం దొరకదు. జ్ఞానం ఉన్న వాళ్ళ అందరు బ్రాహ్మణులు అయితే శూద్రులకు ఎందుకు మీరు చదువునుండి దూరం చేసేరు ,వాళ్ళను బానిసలలాగే చూసేరు , వేదం చదవటానికి శూద్ర కులాలకి ఎందుకు అర్హతలేకుండా పోయింది . 

ఇంకా చెప్పాలి అంటే అది వాళ్ళ ఖర్మ అంటారు ఖర్మ సిద్దాంతం ప్రకారమే ఎవరి ధర్మాలు వారు పాటిస్తున్నారు అంటారు , ఇంకా ఈ సాంకేతిక విప్లవ , ప్రపంచీకరణ లో ఈ ఖర్మ సిద్దాంతం పనిచేస్తుందా ? కొంతమందిని దూరంగా పెట్టి అది నీ ఖర్మ అంటే మీ మనసాక్షి , మీ ధర్మం ఒప్పుకుంటుందా !?. మీ మత ధర్మం ఒప్పుకోనప్పుడు ఖచితంగా వారు వేరే దారి చూసుకుంటారు , వేరే మత మార్గాన్ని అనుసరిస్తారు అప్పుడు మనం గగ్గోలు పెట్టుకున్న లాభం లేదు . వేరే వాళ్ళను నిందించే కంటే మన తప్పులను ఇకనైనా సరిదిద్దుకోవాలి .అప్పుడు వేరే మతం మన దరి  దాపులకు కుడా   రావటానికి బయపడతారు .

ఈ మద్య ఒక్క TV ఛానల్ లో నిర్వహించిన ధార్మిక సమ్మేళనం లో ఒక్క స్వామిజి వారు " హిందూ " అనే పదాన్ని ఇతర బాషలలో దాని యొక్క అర్ధాన్ని తప్పుగా ప్రచురిస్తున్నారు అని మనం ఆ ' హిందు"  అనే మాటను మర్చుకుందాం అని చర్చకు తెరతీసేరు . ఎవరో ఇతర మతస్తులు , ఇతర దేశ స్కాలర్స్ మన ధర్మం గురించి తప్పుగా రాస్తే పెద్దలు దానిని సమర్దంగా ఎదురుకోవాలి కాని ఇలా ఎలా మార్చుకుంటాం . తర తరాలుగా హిందు ధర్మం లేదా మతం మీద దాడి జరుగుతుంది దానికి మనం వర్ణాలతో ,వర్గాలతో  ఉతకర్రను ఇస్తున్నాం . ముక్యంగా ఈ మతం లో ఆదిపత్య వర్గం తమ సహజ సిద్దమైన అహంకార తనం వలన ఇతర నిమ్న కులాలు ఈ మత ధర్మం నుండి దూరం అవుతున్నారు  అనేది గ్రహించాలి ,ఆ ప్రజల నుండి ఆ బావన తొలగించి వాళ్ళకు ' హిందు మత ధర్మం 'లో బాగస్వామ్యం కలిపిస్తే ఏ అన్య మతం నుండి హిందు మతానికి మన దేశంలో ప్రమాదం రాదు .