1, ఏప్రిల్ 2014, మంగళవారం

ఓటు - నోటు !



నాకు ఒక్కటి అనిపిస్తుంది బహుశా ప్రపంచం మొత్తం మీద ఇతరులకు నీతులు చెప్పేవాళ్ళు - మేము నీతిమంతులం అని అనుకునే వాళ్ళు మన దేశం లోనే అధికంగా ఉంటారు ఏమో ! 

ఓటు - నోటు , ప్రతి ఎన్నికల సమయం లో కొందరు మేము ఉన్నాం అంటూ ముందుకు వస్తారు సంఘ సంస్కర్తల రూపం లో , పెద్ద మనుషుల రూపం లో ఖద్దరు అంగి వేసుకుని 

నోటు కు మీ ఓటు అమ్ముకోవద్దు అంటూ , అసలు ఈ ఓట్లు అమ్మకం ఎక్కడ ఉంది ? ఎవరు కొంటున్నారు? సహజంగా మన దేశం లో అత్యధికంగా ఓట్లు పోలుయ్యేది పేద , మధ్యతరగతి ప్రజలు ఉండే పోలింగ్ కేంద్రం లోనే , ఓట్లు అమ్ముకుంటున్నారు అనేది కూడా ఈ ఓటరులనే. ఒక్కసారి పూర్వపరాలు పరిశీలిద్దాం. 

పేద మధ్యతరగతి కాలనీలలో లేదా మహా నగరం అయిన హైదరాబాద్ లోని మురికి వాడలలో ప్రబుత్వం లేదా ఎన్నుకోబడిన ఆయా రాజకీయ నాయకులు ఆ కాలని అభివృద్దికి ఎంత ఖర్చు పెడుతున్నారు. అదే జూబ్లి హిల్స్ లాంటి కాలనీలలో ఎన్ని సార్లు రోడ్లు వేస్తారు ,  విద్యుత్ , నీరు , పార్క్ లాంటి ముక్యమైన అవసరాలు ఎలా తీరుస్తున్నారు. 

వేసవి వచ్చే సమయానికి పేదవాడు మంచి నీళ్ళ కోసం ధర్నాలు చెయ్యాలి. అసలకి వాళ్ళ గోడు వినేవాడు ఉంటాడా ? ప్రబుత్వం ఇచ్చే నిధులు పార్లమెంట్ సబ్యుడికి కనీసం అవి కూడా ఖర్చు పెట్టారు . మావురిలో ఒక  వెధవ వాళ్ళ కులపోళ్ళ హాస్టల్ బవనానికి నిధులు ఇస్తాడు , శాస్వితంగా ప్రజలకు నీళ్ళు ఇవ్వటానికి ఆ డబ్బులు ఇవ్వడు. 

ఓట్లు ఆడుకొని , కాళ్ళకు దండం పెట్టి ,బ్రతిమిలాడి గెలిచిన తరువాత ఆ కాలని వాసనే పడదు. 

ఇలాంటి సందర్భం లో  సేవకుడు పోయి ఆ రూపం లో వ్యాపారవేత్త డబ్బు ద్వారానే రాజకీయం చేస్తున్నాడు. ఇదు సంవస్తారాలకు ఒక్కసారి కనిపించే ఆ రాజకీయ వినాయకుడు ఇచ్చే డబ్బుల కోసం నెల కష్టపడితే రాని పచ్చ నోటు ఇస్తుంటే చెయ్యి చాపుతున్నారు . డబ్బు ఆశ . నేను చాల ఎన్నికలలో పనిచేసేను ఎవరు మాకు డబ్బులు ఇవ్వండి ఓటు వేస్తాం అని అడగలేదు , ఏ రాజకీయ నాయకుడి ఇంటి ముందుకు వెళ్లి ఓట్లు తాకట్టు పెట్టుకోలేదు. వాళ్ళది అభిమానం , నాయకుడు అంటే అభిమానం , పార్టి కోసం చచ్చే అభిమానం అంతే కాని ఓట్లు తాకట్టు పెట్టుకునే ఆత్మాభిమానం లేని వాళ్ళు కాదు. 

మద్యం పంచుకునేది ఆ పార్టి కార్యకర్తలే! 

ఇది ఇలా ఉంటె మెరుగైన సమాజం కోసం అంటూ ఆ సమాజం లోని కొంతమంది పెద్దలు రోజు చెబుతూ ఉంటారు ఓట్లు అమ్ముకున్న వాడు గాడిద అని , మరి కొన్న వాడు అడ్డగాడిద అని ఎందుకు ప్రకటన ఇవ్వలేక పోతున్నారో అర్ధంకాని ప్రశ్న ? అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటె ఆ కొనే వాడు వాళ్ళ సామాజిక వర్గమో , ప్రాంతమో, పార్టి నో లేక మతస్తుడో అయి ఉంటాడు. అందుకే వాడిని ఏమి అనడు. 

ఇది ఎలా ఉంది అంటే శాపగ్రస్తులైన మహిళలు శరీరాన్ని పొట్ట నింపుకోవటం కోసం ఆముకుంటుంటే , ఆమె దగ్గరకు వచ్చే విటుడిని వదిలేసి " వ్యభిచారి " అనే ముద్ర వేసి శిక్ష విధించినట్టు గా ఉంది. 

కాబట్టి ఓ మెరుగైన సమాజం లోని మేధావులారా ! 

మీరు నిందించేది ఎవరిని లంచం ఇచ్చేవాడినా .............. ప్రోస్తహించేవాడినా లేక తీసుకునే వాడినా. లంచం
తీసుకోవటం ఎంత నేరమో ఇచ్చేవాడిది అంతే నేరం కదా ? మరి మీరు ఎవరిని ప్రశ్నించాలి ? ఎన్నిక అయిన తరువాత మెరుగైన సమాజం కోసం మీరు ఏనాడు అయినా ఆ  ప్రతినిధిని ప్రస్నించెరా !

మేదావుల్లారా మీ నీతి ' నేతి బీరకాయ ' లాంటిదేనా 

ఓట్లు అమ్ముకోవటం ఎంత నేరమో ......... కొనటం కూడా అంతే నేరం అని చెప్పగలరా !

ఓట్లు అమ్ముకునే వాడు గాడిద అయితే , కొనే వాడు అడ్డగాడిద గొంతుఎత్తి చాటండి. 

కాబట్టి మెరుగైన సమాజం కోసం దొంగే దొంగా .... దొంగా అని అరిచినట్టుగా కాకుండా ... ఆ దొంగ ఎవడో చెప్పండి