బారత దేశం పుణ్యభూమి, ఖర్మ భూమి ఇక్కడ ఎందరో ఋషులు , పుణ్యస్త్రీలు నివసించిన ప్రాంతం. బుద్దుడు జన్మించిన నేల. వేల సంవస్తరాల క్రితం, చరిత్రలో పురాణాలలో మనం చదువుకున్నది కిరాతకులు చిట్టి అడవిలో , కొండ గుహల్లో ఉండేవారు , రాను రాను వారె దోపిడీ దొంగలు అయ్యారు అటుగా వొచ్చిన ఆడవాళ్ళను బలత్కరించే వాళ్ళు కానీ నేడు సభ్య సమాజం లో మన మధ్యే , మనతోనే తిరుగుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు , ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే బలాత్కారిస్తున్నారు , ఘోరంగా , కిరాతకంగా ప్రపంచం తలతిన్చుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు.
నేడు దేశం అట్టూడికి పోతుంది , ఎక్కడ చుసిన నిరసనలు ,రాష్ట్రపతి భవన్ ముట్టడి , దేశ పార్లమెంట్ ముట్టడి , డిల్లీ నడి రోడ్ మీద ఒక్క 23 సంవత్సరాల యువతి మీద అత్యంత దారుణంగా ,పాశవికంగా జరిగిన రేప్ నేడు దేశం తల దించుకునెల చేసింది .
ఆది నుండి నేటి కలియుగం వరకు మనకు సమాజం స్త్రీ ని అత్యంత దారుణంగా చూస్తుంది. ముక్యంగా మనువాదుల పితృస్వామ్య వ్యవస్తలో ' స్త్రీ ' ఒక్క విలాస వస్తువు . మన అమ్మమ్మలు చెప్పే కథ లు నుండి నేటి మన మహేష్ బట్ సినిమా కథల వరకు అదే వివక్ష . చిన్నప్పటి నుండే మన మగాళ్ళు తమ మగ తనం వింటూ ఉంటారు కృష్ణుడు కి 16 వేల మంది గోపికలు , ఇద్దరు భార్యలు ఇంకా అత్యంత ప్రియమైన ప్రేయసి . ఇక్కడ అత్యంత ప్రతివతగా ,గుణ గణ లు కలిగిన రుక్మిణి ని ఆడపిల్లలకు చెబుతారు. అప్పుడే మనం ఈ వివక్షను ప్రశ్నించి ఉంటె ఈ దేశ మహిళల భవిషత్ నేడు రోడ్డుపాలు అయ్యేది కాదు ఏమో . హరిచంద్రుడు తన భార్యను వారణాసి నడి వీధిలో అమ్ముతున్నప్పుడు చంద్రమతి ప్రశ్నించి ఉంటె ! నేడు బజారులలో ఆడపిల్ల అమ్మకానికి వస్తువు అయ్యేది కాదు ఏమో . ఏదైనా మహిళలకే అవమానాలు అయిన ,అమ్మకాలు అయిన . నీవు ప్రతివతవు కాదు అన్నప్పుడు ' సీత ' లాగి రాముడు చెంపమీద కొట్టి ఉంటె ' రాముడి ' మత్తు వోదిలేది . ఒక్క ఆడది బారతదేశం నడి వీదిలో అవమానం పడి తనను తానూ ప్రతివత అని నిరుపించుకోవటానికి అగ్ని లో దూకి నిరూపించుకుంది . ప్రాతివత్యం పోగూడదు అని భర్త చితిమీద దూకింది. ఆనాడు కౌరవుల నిండు సభలో, సభ్య సమాజం ముందు ' ద్రౌపతి ' ని దుశ్శాసనుడు అవమానించినప్పుడే ఆ నాటి సమాజం ఖండించి ఉంటె నేడు అభినయ దుశ్శాసనులు నేడు మన నడి బజారుల్లో స్త్రీని బలత్కరించే వాళ్ళు కాదు.
ఏది ఏమైనా వివిధ కారణాల వలన నేడు నడి రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా ఉంటె తన ఉనికికే ప్రమాదం వస్తుంది . ఇందుకు సమాజం బాద్యత వహించటం లేదు . గ్లోబలీకరణ నేపద్యం లో పాచత్య అలవాట్లు , కల్చర్ మన దేశాన్ని ముంచేస్తుంది . ముక్యంగా మీడియా ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడుతుంది. అడ్డమైన ధారావాహిక కథలు , రాత్రి 10 గం అయితే నేరుగా మన ఇళ్ళలోకి శృంగార కావ్యాలు వచ్చేస్తున్నాయి . బాలీవుడ్ సినిమాల రూపంలో అడ్డు అదుపులేని శృంగారం. మన పసి జీవితాలమీద బలవంతంగా రుద్దు తున్నాయి . స్కూల్స్ ముందు సినిమా ప్రకటన ఉండకూడదు అని ఎన్ని చట్టాలు చెప్పిన పట్టించు కునే నాధుడు యేడి , చట్టాన్ని దైర్యంగా అమలుచేసే అధికారి ఏడి ?
సమాజం తన భాద్యత మరిచి పోయింది . గుడి , బడి వ్యాపార వస్తువు అయింది. ఇప్పుడు గాంధీ మనకు ఆదర్శం కాదు ' ఇమ్రాన్ హాష్మి మనకు ఆదర్శం. అభివృద్ధి ఒక్క వస్తువు , వ్యాపారలలోనే కాదు ' నాగరీకత ' లో కుడా ఉండాలి. అనాగారీకంగా స్త్రీలను మానబంగం చెయ్యటం నాగరికత కే అవమానం .
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత
నిజంగా ' వేద కాలం లో స్త్రీ పూజింపబడిండా ! లేక వాళ్ళు ముందుగానే మనిషి అవలక్షణం ఉహించి చెప్పేరా ! స్త్రే " ఆది పరాశక్తి " అంటాం , అని పూజిస్తాం ఏది ఆశక్తి ? ఆనాడు ఒక్క నరకాసురుడిని చంపితే పండగ చేసుకున్నాం మరి నేడు ఊరికో నరకాసురుడు , ఆసిడ్ బాటిల్ తో , బ్లేడ్ లతో , మగతనం తో .
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్నువిలాసిని జిష్నునుతె
భగవతి హే శితికంతకుతుమబిని భూరి కుటుంబిని భూరి క్రితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
మా ప్రార్ధన ఆలకించు తల్లి ఇంకొక సారి నీ విశ్వరూపం చూపించి నీ బిడ్డలను రక్షించు తల్లి !!


