ఆ మద్య మన శాస్త్రజ్ఞులు " మేధోమధనం " చేసి - కృత్రిమంగా మేఘాలను మధనం చేసి వర్షాలు సృస్తిస్తము అని వేలాది కోట్ల ప్రజల సొమ్మును మంట పెట్టి పోగవేసేరు. ఈ మద్య మన దేవుడి Represents యజ్ఞ , యాగాలు చేసి కుంభవృష్టి గా వర్షాలు పడేటట్టు చేస్తాము అని దేవుని సొమ్ము - ప్రజల సొమ్ము బూడిద చేసేరు . కానీ ప్రకృతి మాత్రం తన ధర్మం ప్రకారం ఏ రోజులలో వర్షం పడాలో ఆరోజు తన ఋతువులు ప్రకారం వర్షం కురిపిస్తుంది. మనకు చిన్నతనం నుండి తెలుసు ' వినాయక చవితి ' కి వర్షం పడటం లాగే ' దీపావళికి ' వర్షం పడటం , మనం మతాబులు బయట ఎండకు అరబెట్టడం , చినుకు పడితే ఇంటిలో పెట్టుకోవటం ఇవి అన్ని మనకు తెలిసిందే . ఋతువుల ప్రభావం వలన రాష్ట్రము లో వర్షాలు పడుతున్నాయి , మా ఊరిలో కూడా ముసురు పట్టి గత మూడు రోజులుగా వర్షం పడుతుంది . అందుకే మనం ' ప్రకృతిని ' ప్రేమిద్దాం , పూజిద్దాం.
మన పూర్వికులు ప్రకృతిని ప్రేమిచేరు - చెట్టుని ( వేప చెట్టు ) పూజించేరు , జంతువు ( గోమాత ) ని పూజించేరు , నీళ్ళను ( గంగ నది ) ని పూజించేరు , భూమిని , పక్షులను, పుట్టలను పూజించేరు . వాళ్ళకు మన ప్రకృతిలో ప్రతిదీ పుజ్యనీయమే ,చిన్నతనం లో పిచ్చుక ల గుంపు ఇంటిముందు వాలితే సజ్జలనో , లేదా అన్నమో చల్లేవాళ్ళు మన తాతలు , వాటిని తరమకూడదు అని చెప్పేవాళ్ళు . ఒక్కప్పుడు మట్టి పాత్రలు, సత్తు పాత్రలు మన ఇళ్ళలో ఉంటె స్టీల్ పాత్రలు ఉండే వాళ్ళను చూసి చిన్న బుచ్చుకున్నం , ఇప్పుడు వాటిస్తనం లో " ప్లాస్టిక్ " మహం మారి మన ఇంటిని ఆక్రమించుకున్నాయి . ఆ విషం వలన మన ముక్కు పచ్చని చిన్నారులు చనిపోతున్న మనం వాటినే ప్రేమిస్తున్నాం. మనం ఇప్పుడు ప్రకృతిని పూజించటం లేదు , కనిపించని ఆ దేవుడిని పుజిస్తున్నాం. ప్రకృతికి విరుద్దంగా మనం కృత్రిమ ప్రకృతిని సృస్టిస్తున్నాం. అందుకే మన ఇళ్ళలో ప్లాస్టిక్ పూవులు , ప్లాస్టిక్ తోరణాలు , ప్లాస్టిక్ ప్లేట్స్. అంటే మన వినాశనాన్ని మనమే కోరుకున్నం ......కోరుకుంటున్నాం .
మనకు ప్రకృతి అద్బుతమైన జీవ సంపదనించింది , చిన్న , చిన్న క్రిమి కీటకాలనుండి పశు పక్షాదులు వరకే అన్నీ మన జీవన పరిణామా క్రమములో మనకు ఉపయోగపడుతున్నవే . మనకు తెల్లవారింది అని చెప్పటానికి " కాకులను " ఎండా కాలం వచ్చింది అని చెప్పటానికి " కోకిలను " ప్రతి కాలాన్ని చెప్పటానికి ,ఋతువు లు మార్పులను , కాలం మార్పులను చెప్పటానికి ఒక్కొక్క చెట్టును , పక్షులను , జంతువులను ప్రసాదించింది .ఎండిన ఆకులు , పశువుల పేడ , చెత్త ఇవే ఒక్కప్పుడు మన భూమిని సారవంతం చేసింది , నేడు కృత్రిమంగా సృష్టించుకున్న రసాయనిక ఎరువులు , విషాన్ని పండిస్తున్నాయి , ఆవిషం తిన్న మనం 40 ఎండలకే గుండెపోటు కి గురిఅవుతున్నాం , మన చిన్న తల్లుల లో అసహజ శారీరిక మార్పులు .
వీటన్నిటికి మనం మన ప్రకృతి దేవతను పూజించక పోవటమే ఇన్ని అనర్దాలు , లేని దేవుడి కోసం మనం కోట్లు ఖర్చు చేస్తున్నాం , కృత్రిమంగా సృష్టించే science ని , దేవుడి పేరు చెప్పి ప్రకృతి విద్వంసం చేసే వాళ్ళను పుజించకండి . కృత్రిమ పువ్వులు ఇంటిలో పెట్టుకునే కంటే ఒక్క మందార చెట్టుని పెంచండి , విరగ పూసిన మందారాలు మన కి ఆహ్లాదనాన్ని ఇస్తాయి , మన శిరోజాలకు రక్షణ కవచంగా ఉంటుంది.
మనలను మనం వినాశనం చేసుకునే కంటే ప్రకృతిని కాపాడుకుందాం . ప్రకృతిని పూజిద్దాం
సర్వేజన సుఖినో భవంతు !!!
( Bio diversity సదస్సు సందర్భంగా )
