19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ప్రజాస్వామ్యం జిందాబాద్ , ఫాసిజం నశించాలి.

"బలాబలాల సమతుల్యత అనే పద బంధం యుద్ద ప్రేరేపకుల సంధిప్రేలాపన. ఇది పై చేయి సాధిస్తున్న కాలం ప్రపంచం లో ఎక్కడా శాంతి కి తావుండదు" : జాన్ బ్రైట్, బ్రిటిష్ రాజనీతిజ్ఞడు.

మన దేశం లో ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. కేంద్రం లోని బా జ పా ప్రబుత్వం తమ అవకాసాలను సుస్తిరం చేసుకోవటానికి ఉపయోగిస్తున్న ఎత్తుగడలు , ప్రణాలికలు చూస్తుంటే తమ రాజకీయ బలం పెంచుకునేదానికి అత్యంత తెలివిగా ప్రజలను వర్గాలుగా విడదీస్తూ అప్పుడు అప్పుడు నీతి సూత్రాలు చెబుతుంది.

ప్రపంచం లో ఏ మూలకు వెళ్ళినా ప్రజలు రెండు వర్గాలుగా మనకి కనిపిస్తారు. ధనికులు - పేదలు. పెట్టుబడిదారులు - సోషలిస్ట్ లు / ప్రజాస్వామ్య వాదులు. కాని బారత దేశం విబిన్న కులాలుగా విడిపోయింది. క్షత్రియ - బ్రంహణ వర్గాలు ఒకవైపు ఉంటే శూద్ర కులాలు ఇంకొక వైపు. ఆ కులాలను శాసిస్తున్న హిందూ మత రాజ్యాంగం ప్రజలను శాసిస్తుంది. గత దశాబ్ద కాలంగా హిందూ మత రాజ్యాంగం వైపు అత్యంత చాకిచాక్యంగా పావులు కదిపేరు ఆ ప్రయత్నం లో ఒకవిధంగా పై చెయ్యి సాధించే దిశగా ఉన్నారు. ఇందుకు శూద్ర కులాలను హిందు మత రాజ్యాంగం అక్కున చేర్చుకోవటం మొదటి ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఆ క్రమము లోనే అర్ ఎస్ ఎస్ - బా జ పా కళ్యాణ సింగ్ , ఉమాబారతి , ప్రస్తుత ప్రదాని నరేంద్ర మోడీ లాంటి శుద్రులను తెరపైకి తీసుకు వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ మీద ప్రజల అవిస్వాసం ఒకవైపు - అభివృద్ధి ముసుగులో దిగజారి పోతున్న ప్రజల ఆర్ధిక పరిస్తితులు , యువత అసహనం మోడీ & కో మత జాతీయత ప్రజలను ఆకర్షించింది. మెజారిటీ శూద్రులు , అగ్రకులాలుగా హిందూ మత రాజ్యాంగాన్ని బుజాన ఎత్తుకున్నారు. అందుకే ప్రజలు, సమజాం రెండు వర్గాలుగా విడిపోయింది అర్ ఎస్ ఎస్ & కో మత జాతీయ వాదులు - దళిత ముస్లిం అంబేద్కర్ వాదులు మరియు కమ్యునిస్ట్ లు. 

మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ జె న్ యు వరకూ ప్రస్తుత పరిణామాలు గమనిస్తే సమాజం దళిత , ముస్లిం అంబేద్కర్ మరియు కమ్యునిస్ట్ - అర్ ఎస్ ఎస్ మత రాజ్యాంగ వాదులుగా సమాజం విడిపోయింది.
ప్రజస్వామ్యం కాపాడాల్సిన న్యాయవ్యవస్త , పోలీసు , మీడియా కూడా వర్గాలుగానే విడిపోయింది అని చెప్పటం లో ఎలాంటి ప్రశ్నకు తావులేదు. ది పొర్త్ ఎస్టేట్ ఇప్పుడు పాలకుల జేబు సంస్తగా మారిపోయింది.

" for in these days, with the press in hand it is easy to manufacture great men " Babasaheb Dr. B R Ambedkar
బహుసా ఆనాడు బాబాసాహెబ్ చెప్పిన మాట నేడు నిజం చేస్తున్నారు.మీడియా / సోషల్ మీడియా ఇప్పుడు కొత్త జాతీయ వాదులను తయారు చేసే పనిలో చాలా బిజీ గా ఉంది. అందుకే క్షణాల్లో రోహిత్ వేముల , జె న్ యూ విద్యార్ధి నాయకుడు కన్నయ్య కుమార్ మరియు వారి అనుచరులు క్షణాల్లో దేశ ద్రోహులు అయ్యేరు. 

చివరిగా బాబాసాహెబ్ డా బి ర్ అంబేద్కర్ గారు చెప్పిన ఇంకొక మాట చెబుతూ ముగిస్తాను.
" Ours is a battle; not for wealth , not for power, ours is battle; for freedom for reclamation of human personality "
ప్రజాస్వామ్యం జిందాబాద్ , ఫాసిజం నశించాలి. 

6, జనవరి 2016, బుధవారం

పినాకిని ఎక్స్ ప్రెస్ 12711; దేవుడా నేను మాత్రమే బాగుండాలి!

పినాకిని ఎక్స్ ప్రెస్ 12711; దేవుడా నేను మాత్రమే బాగుండాలి

ఉదయం 8:20 నిముషాలు...,
పినాకిని ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా నడుస్తుంది. మంచు దుప్పటిని చీల్చుకుంటూ వేగంగా పరుగులు తీస్తుంది చెన్నై వైపు. నేను అందులో ప్రయాణిస్తున్న సి 1 - 46 నా సీట్ . సహజంగా ఏ సి కోచ్ లో చాల గంభీరంగా వుంటుంది. ఆరోజు ఎందుకో లోనకి అడుగుపెట్టేసరికి కొంచం సందడి అనిపించింది. ప్రయాణికులు తమ సీట్స్ లో కుర్చున్నతరువాత నిశబ్దంగా ఉంటుంది అని మనసులో అనుకున్న. నా పక్కన ఇద్దురు సేనియర్ సిటిజన్స్ బార్య , భర్త , వాళ్లతో పాటు ఇంకో మూడు కుటుంబాలు వాళ్ళు సేనియర్ సిటిజన్స్ నే. ఏంటో ఈ రోజు ముసలి వాళ్ళే అందరూ అనుకున్న. ఇంతలో ఒక నెలలు నిండని బేబి ఏడుపు మొదలైంది, ఏ సి కోచ్ లో బయట శబ్దం , రైలు శబ్దం వినపడదు కాబట్టి ఆ బేబి ఏడుపు చాల బాగా వినిపిస్తుంది. ఆ తల్లి ఏడుపు ఆపటానికి ప్రయత్నించి చివరకు సఫలీకృతం అయ్యింది.
ఇది అంతా ఎందుకు చెబుతున్నాను అంటే తరచూ ప్రయాణించే నాకు ఆరోజు నాతో పాటు ప్రయాణించే మిగతా ప్రయాణికుల ఇబ్బందిని తెలియపరచటానికి.
మనం సమజం లో ఉన్నప్పుడు కొద్దో గొప్పో స్పృహ ఉండాలి. మన వలన పక్కన వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని. నెలలు నిండని ఒక చిన్న బేబి ఏడుస్తుంటే ఎక్కడ సాటి ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఆ తల్లి ఆ ఏడుపు ఆపటానికి ప్రయత్నించిందో, వయసులో పెద్ద వాళ్ళు నలుగురికి చెప్పే స్తితిలో ఉన్న వాళ్ళకి ఆ స్పృహ లేకపోయింది.
అప్పటికే రైలు అరగంట ప్రయాణించింది. ఆలస్యం అవటం వలన అనుకుంటా కొంచం వేగం పెరిగింది. నేను మొదట చెప్పినట్టు నా పక్కన సేనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు మనకు తెలిసిందే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు , వాళ్ళ తో పాటు మిగతా సేనియర్స్ కూడా. ఉదయం కావటం వలన అందరు సమయం పాటిస్తున్నారు. ఈ రోజు ఏంటో నాకు కొత్తగా అనిపించి మనసులోనే నవ్వుకుని తోటి ప్రయాణికుడి వద్ద తెలుగు పేపర్ ఉంటే తీసుకుని చదువుతున్న.
ఇంతలో మా వెనక కూర్చున్న వాళ్ళ లో కదలికి మొదలు అయింది. వాళ్ళ పరిస్తితి చూస్తే పుణ్య క్షేత్రాలు దర్శించటానికి వెళ్తున్నారు. అందరూ మహిళలే , వాళ్లతో పాటు ఇద్దరు పిల్లలు. వాళ్ళ పర్యవేక్షకుడు డబ్బులు వసూళ్ళు చేస్తున్నాడు. ఇంకో కోచ్ లో ఇంకొందరు ఉన్నట్టు అర్ధం అయింది. వాళ్లతో పాటు ప్రయాణించే పిల్ల వాడు మొదలు పెట్టేడు అంకెలు లెక్క పెట్టడడం . పిల్లవాడు అయినా కొంచం పెద్ద గొంతునే. నేను ఏదో సరదా అనుకున్న.... వేలం పాట లాగా అరుస్తున్నాడు, వాడికి మిగతా వాళ్ళు సహకరిస్తున్నారు. బహుసా తంబోలా ఆట అనుకుంటా. ఇంతలో నా ముందు ఉన్న పెద్ద ఆవిడ బాబు అరవకు అని చెప్పేరు. వినలేదు .... నాకు చిరాకు అనిపించింది. పెద్ద వయసులో ఉన్న వారు కొంచం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అయినా వాళ్ళు ఆడుకుంటూ నే ఉన్నారు. కొన్ని నిమషాలు తరవాత నా పక్కన ఉన్న పెద్ద ఆవిడకు వాళ్ళు పిల్లలు నుండి ఫోన్ వచ్చింది ఆవిడ మాట్లాడుతూ బాబు అరవకు ఫోన్ వినిపించటం లేదు అని చెబుతున్నారు. అయినా ఆ పిల్ల వాడు కాదు కదా వాడి తల్లులు కూడా వినటం లేదు. రెండు మూడు సార్లు చెప్పి ఆవిడ ఫోన్ మాట్లాడటం ఆపెసేరు. పిల్ల వాడికి బుద్ది లేక పొతే పెద్దలకు కూడా లేదా , ఫోన్ వినపడటం లేదు , అంతకు ముందు కూడా ఇంకొక పెద్ద ఆమె చెప్పేరు అయినా ఏంటి గలబా అన్నారు నేను పేపర్ చేతిలో పట్టుకున్నాను కాని చదవలేదు ఆమే బాదను గమనించటమే సరిపోయింది. రెండు మూడు నిముషాలు అయిన తరవాత నేను చెప్పెను ఆ పిల్ల వాడికి. ఇంతలో ఆట అయిపోవటం వలన వాళ్ళు ఆపేరు. కొందరు ఆడదాం అంటారు.
అప్పటికే రైలు బిట్రగుంట దాటేసింది. రైలు డ్రైవర్ ఎలాగో సమయాన్ని సరిచేసేడు. ట్రైన్ అనుకున్న సమయానికే పరుగులు పెడుతుంది. మంచు కరిగిపోయి సూర్యుడు కనిపిస్తున్నాడు. సమయం 9:30 కావొస్తుంది.
పక్క వాళ్ళ ఇబ్బంది ని గమనించకుండా అలా ఇబ్బందులకు గురిచెయ్యటం బహుసా వాళ్ళకు తప్పు అనిపించదు.
దేవుడా నేను బాగుండాలి,
దేవుడా నేను మాత్రమే బాగుండాలి
అనుకునే సాటి ప్రజలు ఉన్నంత వరకూ అప్పుడు అప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పదు.
ట్రైన్ పెన్నా నది దాటి ప్లాట్ ఫాం మీదకు వచ్చేసింది.
అయ్యప్ప మాలలు వేసుకుని రైలు కోసం ఎదురు చూస్తున్న స్వాములు ,ఇతర ప్రయాణికులతో ఫ్లాట్ ఫాం సందడి గా ఉంది.
నేను దిగి నా సహచరుడు ఎక్కడ ఉన్నాడో కనుకునే ప్రయత్నం లో ఉన్నాను....,

4, జనవరి 2016, సోమవారం

హలచల్ చేస్తున్న బాత్రూం వీడియో


కొన్ని వీడియో లో క్షణాలలో చాల పాపులర్ అవుతూ ఉంటాయి. ముక్యంగా ఆడవాళ్ళ ప్రైవేట్ వీడియో అంటే ఇంకేముంది జనం క్యూ కడతారు. ఒక అందమైన అమ్మాయి స్నానాల గదిలో బట్టలు విప్పుతూ ఉన్న ఈ వీడియో కూడా అంతే పాపులర్ ఇప్పుడు. అయితే ముగింపు వచ్చేసరికి చూసినవాళ్లు క్షణం అలోచించాల్సిందే. 
సామాజిక దృక్పదం తో తీసిన ఈ వీడియో ఒక్కసారి చూడాల్సిందే !

3, జనవరి 2016, ఆదివారం

తన కోపమే తనకు శత్రువు !


సహజంగా మనం పనిచేసే కార్యాలయాలలో అప్పుడు అప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది. కొంతమంది కి ఈ కోపం ఎక్కువ గా ఉండి చివరకు ఉద్యోగం పోగొట్టుకునే స్తాయి కి వెళ్తారు. కొత్త ఉద్యోగం లో చేరటానికి మళ్ళీ రెండు మూడు నెలలు సమయం. కొన్నిసార్లు ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. తరచూ కంపెనీలు మారుతూ ఉంటే మనమీద హెచ్ ర్ మేనేజర్ లకు మనమీద దురబ్రిపాయం కలుగుతుంది.
సంస్త మీద కాని , మేనేజర్ ల మీద కాని మనకి కోపం ఉంటే మనం పనిమీద కూడా పూర్తగా శ్రద్ధ చూపించలేము. దానితో ఓటమి లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి స్తితికి ఏ ఉద్యోగస్తుడు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇలాంటి స్తితి నుండి బయటకు రావాలి అంటే ఏమి చెయ్యాలి?

నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి.
ప్రతి ఆఫీస్ లలో గాసిస్ప్స్ అనేవి ప్రచారం అవుతూ ఉంటాయి. ముక్యంగా బాస్ మీద , సంస్త ఎదుగుదల మీద లేదా తోటి ఉద్యోగస్తుల మీద. ముందుగా ఇలాంటి వార్తలకు దూరంగా ఉండాలి. మనం సొంతగా ఆలోచిస్తూ ఎదుట వ్యక్తి ట్రాప్ లో పడకుండా జాగర్త పడాలి. ప్రతి సంస్త కి కొన్ని బలహీనతలు ఉంటాయి వాటితో మనకు సంబంధం లేదు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టింది అనే తెలుగు సామెతను గుర్తుంచుకోండి. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించండి.

ప్రతి కార్యాలయాలలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. 1. విమర్శించే వారు 2. నిజాయితీగా మెచ్చుకునే వారు. కొత్తగా ఉద్యోగం లో చేరినవారు ఈ రెండురకాల వ్యక్తులను గమనించి నడుచుకోవాలి.

మీ బలహీనతను ఒప్పుకోండి.

పుట్టికతో అన్ని విషయాలలో సిద్దహస్తులు కాలేరు. ప్రతి వ్యక్తికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ఆ బలహీనతను పదే పదే ప్రచారం చెయ్యకండి. అవసరం అయితే మీ సహచరుడి లేదా సీనియర్స్ సహాయం అడగండి. మొహమాటం పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఓటమి చెందే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు సంస్త బారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

కోపం తో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

ఆవేశం , చికాకులో మనం మాట్లాడే ముందు కొంచం జాగార్తపడాలి. ఒక్కసారి అన్న మాటలు వెనకకు తీసుకోలేము. నా 15 సంవస్తరాల అనుబవం లో చాల మంది ని చూసేను, తొందరగా వాళ్ళు తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. మొదట్లో నేను చాల ఆవేశానికి గురియ్యేవాడిని సంస్త సిబ్బంది మీద, వినియోగదారుల మీద నా బాస్ ఒకసారి డిన్నర్ కి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి నాకు సలహా ఇచ్చేరు, నేను నిదానంగా నా ఆవేశాన్ని తగ్గించుకున్న. ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నలుగురితో మనం కలసి ఉద్యోగం చేస్తున్నప్పుడు జాగర్తలు తీసుకోవాలి.

నిన్ను నీవు అబినందించుకో.

అవును, ప్రతిరోజు నేను ఈ రోజు నా పనిని పూర్తి చెయ్యగలను అనే దృక్పధం తో ఉండాలి. ఈ రోజు టార్గెట్ పుర్తిఅయినప్పుడు ఎస్ నేను గెలిచెను అని ఆనందంగా ఒక చాక్లెట్ నువ్వు నీకు గిఫ్ట్ గా ఇచ్చుకో. అది మీకు మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. మీ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రశాంతంగా ఉండండి ...... సంతోషం గా ఉండండి

28, డిసెంబర్ 2015, సోమవారం

తన కవల సోదరుడిని 36 ఏళ్ళు కడుపులో దాచుకున్న వ్యక్తి !

కడుపులో ఏకంగా తన కవలసోదరున్ని దాచుకున్నాడు సంజు భగత్ అనే ఒక వ్యక్తి. నాగపూర్ లో నివసించే సంజు భగత్ కి ముందు నుండి కడుపు కాస్త పెద్దదిగా ఉండేది ఎలా అంటే 9 నెలల గర్భిణికి ఉన్నట్లు. రైతైన భగత్ కు అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉండేది. కడుపులో ఏదో కణితి పెరుగుతోంది అని అనుకున్నారు, కానీ..!
1999 జూన్ నెలలో ఒక రోజు సంజూ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా ఈ 36 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏదో పెద్ద కణితి ఉందని అనుకున్నారు. అందువల్ల వాళ్ళు సర్జరీ చేసి ఆ కణితిని తీసేద్దామని ఆపరేషన్ మొదలుపెట్టారు. హాస్పిటల్ లోని వైద్యులు కణితి పెద్దది అవడం వలన అతనికి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అనుకున్నారు. అయితే ఆపరేషన్ మొదలు పెట్టగానే ఆతని కడుపులో ఉన్నది చూసి నివ్వెరపోవడం డాక్టర్ల వంతైంది.

డాక్టర్లు ఆపరేషన్ మొదలు పెట్టగానే ట్యూమర్ ఎలాంటిదో గుర్తుపట్టేస్తారు.. అయితే భగత్ విషయంలో ఆ పరిస్థితి వేరేగా ఉంది. కత్తి పెట్టగానే చాలా ఎక్కువ మొత్తంలో రక్తం బయటకి వచ్చింది. అంతే కాకుండా ఒక అవయం తర్వాత మరో అవయవం ఇలా ఒక మనిషి శరీరంలో ఉన్న అంగాలు బయటకు రాసాగాయి అప్పటికి కాని వారికి తెలియలేదు భగత్ కడుపులో ఉన్నది కణితి కాదు ఒక మనిషి శరీరం అని. ఒక మనిషి శరీరం సగం వరకు భగత్ కడుపులో పెరిగిపోయింది. వెంటనే వైద్యులు సర్జరీ చేసి కడుపులో ఉన్న దాన్ని తీసివేసారు. భగత్ కడుపులో ఉన్నప్పుడు వారి తల్లి కవల పిల్లల్ని కడుపులో ఉంచుకుంది కాని కొన్ని కారణాల వలన భగత్ గర్భంలో ఉన్నప్పుడు మరో బిడ్డ భగత్ గర్భంలో రూపాంతరం చెందింది. ఇలాంటి సమయాల్లో పుట్టగానే చనిపోవాల్సింది కాని భగత్ ఎలాగో బ్రతికి బయటపడ్డాడు అని అక్కడి డాక్టర్లు తెలిపారు. చాలా తక్కువ శాతంలో ఇలా పెరుగుతారు అని అన్నారు. ఇలా బ్రతికిన భగత్ ఇన్ని రోజులుగా కడుపులో కణితి పెరుగుతోంది అని అనుకున్నాడే కానీ కడుపులో తన సోదరున్ని మోస్తున్నా అని అనుకోలేదు. ఎలాగోలా ఆపరేషన్ సక్సెస్ అయ్యి బ్రతకగాలిగాడు. అయినా 36 సంవత్సరాలపాటు తన కవల సోదరున్ని కడుపులో మోసిన మొదటి వ్యకిగా భగత్ చరిత్రలోకి ఎక్కాడు..

చికాగో లో 20 మంది తెలుగు విద్యార్ధులు అడ్డగింత

అమెరికా లో చదువుకుంటానికి వెళ్ళిన తెలుగు విధ్యార్ధులను సరైన పత్రాలు మరియు కారణాలు చెప్పలేదు అంటూ చికాగో విమానాశ్రయం నుండి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపేరు. వీరంతా హైదరాబాద్ కు చెందిన ఒక ఏజెంట్ ద్వారా చదువు కోసం అంటూ విమానం ఎక్కేరు. 

వివరాలలోకి వెళితే గత వారం నుండి అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 100 కు పైగా తెలుగు విధ్యార్ధులను సరైన కారణాలు అమెరికా లో చదువుకోవటానికి , నివసించటానికి అంటూ తిప్పిపంపేరు. ఆ విద్యార్ధులకు అమెరికా లో చదువుకోవటానికి సరైన సామర్ధ్యం లేదు అని నిర్ధారిస్తున్నారు. 
ఇది ఇలా ఉంటే చాల మంది విద్యార్ధులు అధికారులు అడిగిన ప్రశ్నకు నిర్లక్షదొరనితో సమాదానం చెప్పటం అమెరికా అధికారులను విస్మయానికి గురిచేసింది. FBI సమాచారం ప్రకారం విద్యార్ధుల నెపం తో ఇక్కడ పని చేసుకుంటూ ఉండిపోవటానికే వీరు వచ్చినట్టు వీరికి అంతగా సామర్ధ్యం లేనట్టుచెబుతున్నారు 



25, డిసెంబర్ 2015, శుక్రవారం

గుంటూరు వృక్ష జాతులు

ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో పుస్తకం రచించిన పిఆర్ మోహన్ రావు

పిఆర్ మోహన్ రావు ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు నగరం యొక్క వృక్ష జాతులు పేరుతో ఒక పుస్తకం రచించారు. గుంటూరు నగరంలో గల వృక్ష సంపదను గురించి రచయుత ఈ గ్రంధంలో సమగ్రంగా వివరించారు.ఇది గుంటూరులోని అనేక జాతుల మొక్కలు మరియు చెట్లును గురించి అందుబాటులో ఉన్న మరియు ప్రామాణికమైన గ్రంధం.
76 ఆవృత బీజ కుటుంబాలకు చెందిన 431 పుష్పించే మొక్కలు, పొదలు మరియు చెట్లకు సంబంధించిన సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. బెన్థం మరియు హుకర్ విధానం యొక్క వర్గీకరణ ఆధారంగా మొక్కలు, పొదలు మరియు చెట్లు కుటుంబాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేశారు.

మోహన రావు గురించి
మోహన రావు ఒక పదవీవిరమణ పొందిన ప్రొఫెసర్ మరియు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఎఎన్ యు) లో బోటనీ శాఖ మాజీ అధిపతి (.హెచ్ఒడి). ఈ పుస్తకం రాస్తున్న సమయంలో ఈయనకి, ఎఎన్ యు అసిస్టంట్ బోటనీ ప్రొఫెసర్ ఎస్ కె ఖాసిమ్ మరియు మాజీ పరిశోధన విద్యార్థి బీబీ ఆసియా సహకరించారు. వీరిద్దరూ డెహ్రా డన్ నుండి బిషన్ సింగ్ మహేంద్ర పల్ సింగ్ ప్రచురించిన ఈ పుస్తకానికి సహ-రచయితలుగా ఉన్నారు.